తన తండ్రి కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వరలక్ష్మీ ఎమోషనల్ పోస్ట్..!

  • July 15, 2022 / 03:36 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో శరత్‌కుమార్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గతంలో ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తెలుగులో కూడా అవి డబ్ అయ్యి హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే తెలుగులో ‘గ్యాంగ్ లీడర్’ ‘బన్నీ’ ‘దేవదాస్’ ‘భరత్ అనే నేను’ ‘నా పేరు సూర్య’ వంటి సినిమాలతో పాటు పరంపర వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఇక్కడ కూడా బిజీ ఆర్టిస్ట్ గా …రాణిస్తూనే ఉన్నారు.

ఇప్పుడిప్పుడే పాలిటిక్స్ లో కూడా ఎదుగుతున్నారు. ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూనే సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇక నిన్న గురువారం నాడు తన 69వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు శరత్ కుమార్. ఈ సందర్భంగా ఆయన కూతురు .. ప్రముఖ నటి అయిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ” ‘వయసు అనేది ఓ నెంబర్ మాత్రమే’ అని మీరు నిరూపించారు. నాకు మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఐ లవ్‌ యూ డాడీ..మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.నాకు నిజమైన స్ఫూర్తి మరియు నాకు నిజమైన హీరో మీరు.’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ కామెంట్స్ చేసింది వరలక్ష్మీ. అంతేకాదు తన తండ్రి శరత్ కుమార్ తో దిగిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. అవి వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus