Varsha Bollamma: పెద్దింటికి కోడలు కాబోతున్న హీరోయిన్ వర్ష బొల్లమ్మ..నిజమేనా?

  • October 28, 2022 / 12:11 PM IST

వర్ష బొల్లమ్మ.. ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న హీరోయిన్. చిన్న సినిమాల్లో నటిస్తున్నప్పటికీ క్రేజీ సినిమాల్లోనే నటిస్తుంది. ‘విజిల్'(తమిళంలో ‘బిగిల్’) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ అటు తర్వాత ‘చూసి చూడంగానే’ ‘జాను’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే పేరు తెచ్చిపెట్టిన మూవీ మాత్రం ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే చెప్పాలి. ఆ చిత్రంలో ఈమె పక్కింటి అమ్మాయి మాదిరి చక్కగా నటించి ఆకట్టుకుంది. అటు తర్వాత రాజ్ తరుణ్ నటించిన ‘స్టాండప్ రాహుల్’ ,

అలాగే ఇటీవల బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు గణేష్ హీరోగా వచ్చిన ‘స్వాతి ముత్యం’ వంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. ఇదిలా ఉండగా.. త్వరలో ఈమె పెళ్లి పీటలెక్కబోతుందనే వార్త ఇప్పుడు ఊపందుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం… వర్ష కి ఓ సీనియర్ నిర్మాత కొడుకు ప్రపోజ్ చేశాడట. ఈమె మాట్లాడే విధానం, సినిమాల కోసం కష్టపడే విధానం అతనికి బాగా నచ్చేసిందట. దీంతో అతను ప్రపోజ్ చేసినట్లు తెలుస్తుంది.

కొడుకు కోరికను కాదనలేక సీనియర్ నిర్మాత కూడా వీరి పెళ్ళికి అంగీకరించినట్టు తెలుస్తుంది. త్వరలోనే కర్ణాటక వెళ్లి వర్ష బొల్లమ్మ పెద్దల్ని కూడా కలిసి ఈ విషయం పై మాట్లాడాలని ఆ సీనియర్ నిర్మాత కుటుంబ సభ్యులు భావించారట. అయితే ముందుగా ఫోన్లోనే ఈ విషయాన్ని చెప్పి వారిని ఒప్పించినట్లు తెలుస్తుంది. త్వరలోనే వర్ష పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అనేది ఈ వార్త సారాంశం.

అయితే ఆ సీనియర్ నిర్మాత ఎవరు? అతని కొడుకు మరియు వర్షని పెళ్లి చేసుకోబోయే ఆ అబ్బాయి ఎవరు? ఈ వార్తల్లో నిజం ఉందా? లేక వట్టి రూమరా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. మరోపక్క వర్ష నటించిన ‘మీట్ క్యూట్’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి హీరో నాని నిర్మాత కాగా అతని సోదరి దీప్తి ఘంటా దర్శకురాలు కావడం విశేషం.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus