టాలీవుడ్ ప్రేక్షకులకు క్రష్ గా మారిపోయిన వర్ష..!

టాలీవుడ్లో హీరోయిన్ల కొరత ఎక్కువగానే ఉంది. సీనియర్ హీరోలకు మాత్రమే కాదు.. స్టార్ హీరోలకు కూడా హీరోయిన్లు దొరకడం లేదు. ఈ క్రమంలో ఆల్రెడీ చేసిన హీరోయిన్లతోనే మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తూ వస్తున్నారు మన టాలీవుడ్ హీరోలు. ఈ క్రమంలో కాస్త ఇమేజ్ తెచ్చుకున్న ఏ హీరోయిన్ ను అయినా సరే మీడియం రేంజ్ హీరోల సినిమాల కోసం ఎంపిక చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.తాజాగా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ హీరోయిన్ వర్ష బొల్లమకు కూడా మంచి గుర్తింపు లభించింది.

ఈ చిత్రంలో పక్కింటి అమ్మాయిలా కనిపించి.. కుర్రకారుకి క్రష్ గా మారిపోయింది వర్ష. దాంతో ఈమె గురించి గూగుల్ లో సెర్చింగ్ చెయ్యడం మొదలుపెట్టారు నెటిజన్లు. ప్రమోషన్లలో కూడా తెలుగు చక్కగా మాట్లాడుతున్న ఈ హీరోయిన్ ను చూసి మన వాళ్ళు ఫిదా అయిపోయారు. నిజంగా ఈమె తెలుగమ్మాయే అయ్యుంటుంది అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఈమె తెలుగమ్మాయి కాదు. రష్మిక మందన లానే ఈమె కూడా కన్నడ అమ్మాయేనట. అంతకుముందు ఈమె తెలుగులో ‘చూసి చూడంగానే’ ‘జాను’ వంటి చిత్రాల్లో నటించింది.

తెలుగుతో పాటు తమిళంలో కూడా ‘బిగిల్’ ’96’ వంటి చిత్రాల్లో నటించింది. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రం హిట్ అవ్వడంతో ఈమెకు వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని లేటెస్ట్ టాక్. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే.. టాలీవుడ్ లో ఈమె క్రేజీ హీరోయిన్ గా ఎదగడం ఖాయం అని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus