కొత్త చిత్రంలో వరుణ్ పక్కన నటించేది వీరే

  • April 9, 2018 / 07:36 AM IST

ఫిదా, తొలి ప్రేమ వంటి హిట్స్ అందుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు ప్రయోగాత్మక కథను చేయడానికి సిద్ధమవుతున్నారు. యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించనున్నారు. అంతరిక్షంలో జరిగే ఈ స్టోరీకి జోరుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో వ్యోమగామి (రోదసి యాత్రికుడు) గా వరుణ్ తేజ్ కనిపించనున్నారు. జీరోగ్రావిటీలో తేలియాడేట్టుగా నటించేందుకు అతను ప్రతేకంగా ఖజకిస్థాన్ లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. చెలియా మూవీ ద్వారా మ‌న‌సులు దోచుకున్న బాలీవుడ్ బ్యూటీ అదితిరావు హైద‌రీని సెలక్ట్ చేశారు. ఈమె కూడ త్వరలోనే జీరో గ్రావిటీ శిక్షణ కోసం ఖజకిస్థాన్ వెళ్లనుంది. మరో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి ఖరారు అయింది.

ఈమె గతంలో వరుణ్ తేజ్ కి జోడీగా మిస్టర్ సినిమాలో నటించింది. ఇప్పుడు ఈ చిత్రంలో మళ్ళీ జతకట్టనుంది. ఈ సారి రొమాన్స్ ఉండదని సమాచారం. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పటికీ రొమాన్స్, రొమాంటిక్ సాంగ్స్ ఉండవని ముందుగానే డైరక్టర్ స్పష్టం చేశారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అహంబ్రహ్మాస్మి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బిబో శ్రీనివాస్ సమర్పణలో జాగర్లమూడి సాయిబాబా-రాజీవ్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లు పనిచేయన్నారు. ఈ నెలాఖరులో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా గురించి అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus