జనవరి 12న ‘వీర సింహా రెడ్డి’ గా నటసింహ గర్జన.. సంబరాలు స్టార్ట్ చేసిన బాలయ్య ఫ్యాన్స్..

నటసింహ నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రేక్షకాభిమానులకు సాలిడ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.. యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘వీర సింహా రెడ్డి’.. శృతి హాసన్ హీరోయిన్.. లాల్, ‘దునియా’ విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ మూవీ నుండి మాస్ ఆంథెమ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

‘జై బాలయ్య’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి నాలుగు రోజుల్లోనే 11 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 2023 సంక్రాంతి బరిలోకి దిగబోతున్న ‘వీర సింహా రెడ్డి’ శరవేగంగా షూటింగ్ జరుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాల్లో ఫైట్ చిత్రీకరణ జరుగుతోంది. డిసెంబర్ 8 నుండి బాలయ్య, శృతి హాసన్ మీద సాంగ్ తీయబోతున్నారు. రెండో వారం కల్లా గుమ్మడికాయ కొట్టేస్తారని సమాచారం.

ఇక కర్నూలులో షూటింగ్ స్టార్ట్ అయినప్పటినుండి ‘వీర సింహా రెడ్డి’ ఆన్ లొకేషన్ పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.. బాలయ్య సినిమాలకి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది.. ఈసారి పండక్కి రానుండడంతో అభిమానులు, మూవీ లవర్స్, టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా రిలీజ్ డేట్ ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కట్ చేస్తే.. సినిమా విడుదల తేదీ ప్రకటించి అంచనాలు మరింత పెంచేసింది టీం.. జనవరి 12న నటసింహ ‘వీర సింహా రెడ్డి’ గా బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాడు..

రికార్డుల ఊచకోత మొదలవనుంది అంటూ అప్‌డేట్ ఇచ్చారు. కొత్త పోస్టర్ అయితే బాగా ఆకట్టుకుంటుంది.. రిలీజ్ డేట్ రివీల్ చేసేయ్యడంతో.. ట్రైలర్, సాంగ్స్ కోసం వెయిటింగ్.. బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. ‘వీర సింహా రెడ్డి’ వచ్చేస్తున్నాడు.. అంటూ ఇప్పటినుండే ఫ్లెక్సీలు ఆర్డర్ ఇచ్చేస్తున్నారు నందమూరి అభిమానులు.. ఎప్పటిలానే 2023 సంక్రాంతి సీజన్ బాలయ్యకి కలిసొస్తుందని.. ‘అఖండ’ తర్వాత మళ్లీ బాక్సాఫీస్ మాస్ జాతర చూడబోతున్నామని పోస్టులు చేస్తున్నారు..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus