Veera Simha Reddy: ఆ భాషల్లో కూడా వీరసింహారెడ్డి ఓటీటీలో రిలీజవుతోందా?

  • February 14, 2023 / 12:03 PM IST

వీరసింహారెడ్డి మూవీ ఈ నెల 23వ తేదీన ఓటీటీలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ కానుంది. వీరసింహారెడ్డి మూవీ థియేటర్లలో సంచలనం సృష్టించగా ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిందని సమాచారం అందుతోంది.

వీరసింహారెడ్డి మూవీలో హనీరోజ్, శృతి హాసన్ హీరోయిన్లుగా నటించగా శృతి హాసన్ తో పోలిస్తే హనీ రోజ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమా సక్సెస్ తో స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. గోపీచంద్ మలినేని రొటీన్ కథతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మరో సినిమా దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.

మరికొన్ని నెలల తర్వాత ఈ కాంబోలో సినిమాకు సంబంధించి ప్రకటన రావచ్చని సమాచారం. బాలయ్యతో సినిమా తీయడానికి ఏకంగా 8 మంది డైరెక్టర్లు క్యూలో ఉన్నారని బోగట్టా. అయితే ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ రావాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందేనని చెప్పవచ్చు. బాలయ్య మార్కెట్ ఊహించని రేంజ్ లో పెరగడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

బాలయ్య ప్రస్తుతం అనిల్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. బోయపాటి శ్రీను రామ్ సినిమాతో సక్సెస్ సాధిస్తే వరుస సినిమాలతో బోయపాటి శ్రీను బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus