వెంకటేష్, వరుణ్ తేజ్ మూవీ అప్డేట్

  • June 19, 2018 / 04:07 PM IST

పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలతో డైరక్టర్ అనిల్ రావిపూడి హ్యాట్రిక్ అందుకున్నారు. దీంతో అతను చేయనున్న నెక్స్ట్ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సారి మల్టీస్టారర్ మూవీ చేయనున్నారు. ఇందులో విక్టరీ వెంకటేష్ తో కలిసి వరుణ్ తేజ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి F2 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనేది ట్యాగ్ లైన్. ఈ నెల 23న పూజా కార్య క్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. 30 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. తొలి షెడ్యూల్ 20 రోజుల పాటు హైదరాబాద్ లో జరగనుంది. ఈ మూవీ లో వెంకటేష్, వరుణ్ తేజ్ బావ బామ్మర్దులుగా నటిస్తారని మొన్నటి వరకు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అది వాస్తవం కాదంట.

తోడళ్లులుగా కనిపించబోతున్నట్లు తెలిసింది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా సినిమా ఉంటుందని సమాచారం. ఈ మూవీ లో వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ పక్కన మెహరీన్ లు హీరోయిన్లు గా హంగామా చేయనున్నారు. వీరి నలుగురు మధ్య ఉండే సన్నివేశాలు నవ్వులు పూయించనున్నట్లు ఫిలింనగర్ వాసులు చెప్పారు. గురు విజయంతో వెంకటేష్ జోష్ లో ఉన్నారు. వరుణ్ కూడా ఫిదా, తొలి ప్రేమ హిట్స్ తో దూసుకుపోతున్నారు. అదే ఉత్సాహంతో ఈ సినిమాని వేగంగా కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus