‘సంక్రాంతికి వస్తున్నాం’.. అంటూ చాలా రోజుల క్రితమే చెప్పి.. ఇప్పుడు రెండో షెడ్యూల్ జరుపుకుంటున్నారు విక్టరీ వెంకటేశ్ (Venkatesh) – అనిల్ రావిపూడి (Anil Ravipudi) . మొన్నీమధ్య కూడా సంక్రాంతి రిలీజ్ అంటూ ఘనంగా చెప్పిన టీమ్ ఇప్పుడు ఆలోచనలో పడిందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే సినిమా టైటిల్ విషయంలోనా? లేక సినిమా రిలీజ్ విషయంలోనా? అనేది తెలియడం లేదు. ఇంతకీ ఏమైందంటే.. వెంకటేశ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో దిల్ రాజు (Dil Raju) ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు.
ఈ కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. మొన్నీమధ్యే మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇండస్ట్రీ వర్గాల్లో కూడా సినిమా టైటిల్ విషయంలో రెండు వాయిస్‌లు వినిపిస్తున్నాయి. ఒకటి ‘సంక్రాంతికి వస్తున్నాం’ కాగా, రెండోది సినిమా కాన్సెప్ట్ అయిన ‘ఎక్స్’ బేస్‌లో ఉండబోతోంది. ఇటీవల పొల్లాచ్చిలో సుదీర్ఘ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సినిమా టీమ్ ఇప్పుడు హైదరాబాద్‌లో నయా షెడ్యూల్ ప్రారంభించారు. వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) , మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) తదితర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
15 రోజులపాటు సాగనున్న ఈ షెడ్యూల్‌తో మేజర్ పార్ట్ అయిపోతుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో దసరాకు సినిమా నుండి స్పెషల్ సర్‌ప్రైజ్ ఉంటుంది అని చెబుతున్నారు. ఈ క్రమంలో సినిమా మీద ఉన్న డౌట్స్ క్లియర్ అవుతాయని టాక్. టైటిల్‌పై స్పష్టత వచ్చే అవకాశం, అలాగే రిలీజ్ డేట్ క్లారిటీ కూడా ఆ రోజు వస్తుంది అని చెబుతున్నారు. ముక్కోణపు క్రైమ్ డ్రామా కథతో ముస్తాబవుతున్న ఈ సినిమాలో వెంకటేశ్ మాజీ పోలీసు అధికారిగా కనిపిస్తారు.
అతని ఎక్స్‌లెంట్ భార్యగా ఐశ్వర్య రాజేశ్ నటిస్తోంది. ఇక వెంకీ ఎక్స్ లవర్‌గా మీనాక్షి చౌదరి కనిపించనుంది. కాబట్టి ‘సంక్రాంతి’ గురించి డౌట్స్ క్లియర్ అవ్వాలంటే దసరా రావాల్సిందే. అన్నట్లు వివిధ వీడియోలు, ఫొటోలతో ఇప్పటికే వెంకీ తదితర ప్రధాన పాత్రల లుక్ బయటకు వచ్చేసింది. మరి స్పెషల్ సర్‌ప్రైజ్‌లో ఏముంటుందో?