Venkatesh: ఆ దర్శకుడికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

  • December 14, 2022 / 01:22 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన వెంకటేష్ ను ఇతర హీరోల అభిమానులు సైతం ఎంతో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ సినీ కెరీర్ లో ఫ్లాపైన సినిమాలు చాలా తక్కువనే సంగతి తెలిసిందే. వెంకటేష్ రీమేక్ సినిమాలలో ఎక్కువగా నటించినా ఆ సినిమాలలో తన అద్భుతమైన నటనతో మెప్పించి వరుస సక్సెస్ లను సొంతం చేసుకోవడం గమనార్హం. నారప్ప, దృశ్యం2, ఎఫ్3 సినిమాలతో వరుస సక్సెస్ లను అందుకున్న వెంకటేష్ ప్రస్తుతం రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ కు సంబంధించి అతి త్వరలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే వెంకటేష్ 75వ సినిమాకు శైలేష్ కొలను దర్శకునిగా ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. వెంకటేష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో శైలేష్ కొలను డైరెక్షన్ లో సినిమా తెరకెక్కనుందని బోగట్టా.

నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా తెరకెక్కనుందని ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోతుందని కామెంట్లు వ్యక్తమవువుతున్నాయి. శైలేష్ కొలను ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారని బోగట్టా.

వెంకటేష్ తో సినిమా తెరకెక్కించాలని ఎంతోమంది దర్శకులు ప్రయత్నాలు చేయగా శైలేష్ కొలనుకు ఆ లక్కీ ఛాన్స్ దక్కింది. ఈ సినిమాతో శైలేష్ కొలను మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటే మాత్రం ఈ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరతారని చెప్పవచ్చు. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus