లుంగీలతో తోడి అళ్లుళ్ల హంగామా!

  • July 9, 2018 / 01:55 PM IST

ప్రపంచంతో పాటు పరిగెత్తుతున్నా… ఈ పరుగులో తమ కుటుంబ అనుబంధాలు పలుచన అయిపోతున్నాయని ఆవేదన తెలుగువారిలో బలంగా ఉంది. అందుకే కుటుంబానికి, సొంత ఊరికి ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వీటిలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒకటి. ఆ జాబితాలో ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ చేస్తున్న సినిమా చేరుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే పేరు ఫ్యాషన్ గా F2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) అనే పెట్టినప్పటికీ… తెలుగువారి అనుబంధాలను డైరక్టర్  ఇందులో చూపెట్టనున్నట్టు అర్ధమవుతోంది. అన్నదమ్ములు, తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని ఎమోషనల్ గా తెరకెక్కించి విజయం అందుకున్న అనిల్ రావిపూడి ఈ సారి తోడి అళ్లుళ్ల మధ్య సందడిని బంధించనున్నారు.

అవి సహజంగా ఉంటాయని రీసెంట్ గా  వచ్చిన చిత్రాలు బయట పెట్టాయి. తొలిరోజు వరుణ్ సందేశ్, ప్రియదర్శి పై చిత్రీకరించారు. ఈ షూటింగ్ కి సంబందించిన ఫొటోలో  వరుణ్, ప్రియదర్శి లుంగీ కట్టుకొని ఉన్నారు. ఈ ఫోటో చూస్తుంటే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్ధమవుతోంది. ఈరోజు వెంకీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అతను కూడా లుంగీలోనే కొత్తగా కనిపిస్తున్నారు. వీరిద్దరూ అత్తగారింట్లో చేసే హంగామా ఓ రేంజ్ లో ఉంటాయని ఈ ఫోటోలు స్పష్టం చేశాయి. వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ పక్కన మెహరీన్ లు హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ మనసుదోచుకుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus