Salaar: సలార్ సినిమా జాతకం చెప్పిన వేణుస్వామి!

  • October 5, 2023 / 08:17 PM IST

కోట్లాది మంది ప్రభాస్ అభిమానులతో పాటుగా, సినీ అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సలార్’. గత నెల 28 వ తారీఖున విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 22 వ తేదికి వాయిదా పడింది. రీసెంట్ గానే అధికారిక ప్రకటన కూడా చేసారు, ఈరోజు టీజర్ లో విడుదల తేదీని కూడా అప్డేట్ చేసారు మేకర్స్. ఈ నెల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా 22 వ తారీఖున సలార్ ట్రైలర్ ని కూడా విడుదల చెయ్యబోతున్నారు మేకర్స్.

ఈ ట్రైలర్ ఇప్పటి వరకు ఉన్న అంచనాలను రెట్టింపు చేసే విధంగా ఉంటుందట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాల తాలూకు రీ షూట్స్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుపుకుంటుంది, కొన్ని కొత్త సన్నివేశాలను కూడా ఈ సినిమాలో జతపర్చబోతున్నారట. ఇకపోతే సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు గోపాల స్వామి సలార్ చిత్రం గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి

గతం లో కూడా ఆయన ‘ఆదిపురుష్’ చిత్రం పెద్ద ఫ్లాప్ అవుతుందని చెప్పాడు. ఆయన చెప్పింది చెప్పినట్టు గానే జరిగింది. అలాగే ప్రభాస్ తో ఇక నుండి ఎవరైనా భారీ చిత్రాలను నిర్మిస్తే డబ్బులు బూడిదపాలు చేసినట్టే అని కూడా చెప్పాడు. ఆయన మాటకు తగ్గట్టుగానే బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కి ఇప్పటి వరకు సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు.

ప్రభాస్ చేసిన ప్రతీ సినిమా ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. (Salaar) సలార్ చిత్రం కూడా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొని థియేటర్స్ కి వెళ్తే నిరాశ చెందే ప్రమాదం ఉందని, ఈ చిత్రం కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించదు అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఆయన చెప్పినట్టు జరుగుతుందా లేదా అనేది చూడాలి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus