Pushpa2: వేణుస్వామి జాతకంతో పుల్ జోష్ లో బన్ని ఫ్యాన్స్!

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. సీక్వెల్ సినిమా మొదటి పార్ట్ కన్నా బాగుంటుందని, సినిమా ఎంతో మంచి సక్సెస్ అవుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఇక ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ గ్లింప్ వీడియో ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.. ఇక ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇకపోతే తాజాగా పుష్ప2 సినిమా రిజల్ట్ గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వేణు స్వామి ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల జాతకాలను చెబుతూ వార్తలు నిలుస్తున్నారు.

అయితే గత రెండు రోజులుగా ఈయన ఆది పినిశెట్టి దంపతులు విడాకులు తీసుకొని విడిపోతారని అలాగే పది సంవత్సరాలపాటు నటుడు అల్లు అర్జున్ కెరీర్ కు ఎలాంటి డోకా లేదు అంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్నటువంటి పుష్ప 2 సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుపోతుందనే విషయాల గురించి కూడా తెలియజేశారు.ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ పుష్ప 2 (Pushpa2) సినిమా విడుదలైన తర్వాత సంచలనం సృష్టిస్తుందని

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటుంది అంటూ సినిమా పై పాజిటివ్ గా చెప్పడం పై బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. వేణు స్వామి వంటి ఒక వ్యక్తి పుష్ప 2 సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus