Venu Swamy: వైరల్ అవుతున్న వేణుస్వామి షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి సెలబ్రిటీల జాతకాల గురించి వేర్వేరు సందర్భాల్లో చెప్పిన విషయాలు పలు సందర్భాల్లో వివాదాస్పదమయ్యాయి. వేణుస్వామి చెప్పిన విషయాలు కొన్ని విషయాలు నిజంగా ఆయన చెప్పిన విధంగా జరగగా మరికొన్ని విషయాలు జరగలేదు. ప్రస్తుత కాలంలో చాలామంది జాతకాలను నమ్మడానికి అస్సలు ఇష్టపడరు. అయితే తాజాగా వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక సందర్భంలో వేణుస్వామి మాట్లాడుతూ శ్రీజకు మూడో పెళ్లి జరుగుతుందని తెలిపారు.

ఆమె జాతకంలో నాలుగు పెళ్లిళ్లు ఉన్నాయని ఆమెకు నాలుగు పెళ్లిళ్లు కచ్చితంగా జరుగుతాయని వేణుస్వామి చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారని ఆయన కామెంట్లు చేశారు. వేణుస్వామి పవన్, శ్రీజ పెళ్లిళ్ల గురించి చేసిన కామెంట్లు నిజం అవుతాయో లేదో చూడాల్సి ఉంది. వేణుస్వామి పాపులారిటీ కోసమే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లు అనేవి సెలబ్రిటీల వ్యక్తిగతం అని సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు సమాజంపై పాపులారిటీ చూపవని ఆయన వెల్లడించారు.

పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని అంత మాత్రాన ఆయన ఫ్యాన్స్ మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు కదా అని వేణుస్వామి షాకింగ్ కామెంట్లు చేశారు. వేణుస్వామి చేసిన కామెంట్లపై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఫేమ్ కోసం మెగా కుటుంబానికి చెందిన సెలబ్రిటీల జాతకాల గురించి వేణుస్వామి ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్స్ కామెంట్ల గురించి వేణుస్వామి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

వేణుస్వామి సెలబ్రిటీల గురించి పాజిటివ్ గా కంటే నెగిటివ్ గానే ఎక్కువ విషయాలు చెబుతుండటం గమనార్హం. వేణుస్వామి పలువురు రాజకీయ నాయకుల గురించి కూడా గతంలో కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. వేణుస్వామి చెప్పిన విషయాలు నిజం కాకపోతే భవిష్యత్తులో వేణుస్వామిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేసే ఛాన్స్ అయితే ఉంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus