Naga Chaitanya, Samantha: విడాకులు తీసుకున్న జంటపై వేణుస్వామి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నాగ చైతన్య- సమంత డివోర్స్ ఇష్యూ ఎప్పటికీ మీడియాలో హాట్ టాపికే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీ విడాకులు తీసుకొని సడెన్ షాకిచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో ఎందరో సెలబ్రిటీల జాతకాలు చెప్పిన వేణు స్వామి.. తాను ఆయా సెలబ్రిటీల విషయంలో చెప్పిందే జరిగిందంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా వేణు స్వామి పేరు వార్తల్లో మారుమోగింది.

మరీ ముఖ్యంగా సెలబ్రిటీల పెళ్లిళ్లు, విడాకుల గురించి జోస్యం చెప్పి ఫేమస్ అయ్యారు వేణు స్వామి. కాగా సమంత- నాగ చైతన్య పెళ్లి చేసుకోకముందే ఎన్నాళ్లో కలిసి కాపురం చేయరని చెప్పి షాకిచ్చిన వేణు స్వామి.. తాజాగా ఈ విడాకులకు కారణాలు చెప్పి మరో షాకిచ్చారు. నాగ చైతన్య- సమంత పెళ్లి బంధం నిలవకపోవడానికి అసలు కారణం గ్రహాలు అనుకూలించకపోవడమే అన్నారు వేణు స్వామి. వీళ్లిద్దరి జాతకంలో శని ఉచ్ఛ స్థితిలో ఉందని, అందుకే వీళ్లు కలిసి ఉండలేరు అని ముందే చెప్పానని అన్నారు.

ఇలా ఉన్న జాతకస్తులకు రెండు, మూడు పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. వ్యక్తిగత కారణాలతో విడిపోయిన చై సామ్ జోడీపై లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. బోలెడన్ని రూమర్లు షికారు చేశాయి. ఇప్పటికీ చై సామ్ డివోర్స్ ఇష్యూ చర్చల్లోనే ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం అటు సమంత, ఇటు నాగ చైతన్య (Naga Chaitanya) వారి వారి కెరీర్ పై పూర్తి ఫోకస్ పెట్టి వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నా..

ఏదో ఒక రూపంలో ఈ ఇద్దరూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. వీళ్ళ విడాకులకు అసలు కారణం జాతక దోషమే అని వేణు స్వామి చెప్పడం ఇప్పుడు హాట్ ఇష్యూ అయింది. బాలీవుడ్ లో ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ చేసి ఆకట్టుకున్న సమంత మరిన్ని వెబ్ సిరీసులు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ కంప్లీట్ చేసింది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus