నయన్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన విగ్నేష్…!

  • August 27, 2020 / 12:40 PM IST

లేడీ సూపర్ స్టార్ నయన్ తార సినిమాలతో ఎంత బిజీగా ఉంటుందో… ప్రేమ వార్తలతోనూ అలాగే పెళ్లి వార్తలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యపడనవసరం లేదు. మొదట శింబు అటు తరువాత ప్రభుదేవా లతో ప్రేమాయణం నడిపి … తరువాత బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా దర్శకుడు విగ్నేష్ శివన్ తో నయన్ డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళు పెళ్లికి మాత్రం ఇంకా రెడీగా లేరనే చెప్పాలి.

ఈ మధ్యకాలంలో వీళ్ళిద్దరూ విడిపోయారు అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాడు నయన్ ప్రెజెంట్ బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్. ఆయన మాట్లాడుతూ…”న‌య‌న‌తో నాకు మీడియా దాదాపు 22 సార్లు పెళ్లి చేసేసింది.అయినా మ్యారేజ్ విషయంలో మేము ఏమాత్రం తొందరపడటం లేదు. సినిమాల ప‌రంగా మేము సాధించాల్సింది చాలా ఉంది.

ప్రస్తుతం మాకు పెళ్లి పై ఇంట్రెస్ట్ లేదు. మాకు డేటింగ్ లైఫ్‌ బోర్ కొట్టినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటాం. అప్పటి వరకు మేము పెళ్లి గురించి ఆలోచించం’ అంటూ విఘ్నేష్ శివన్ క్లారిటీ ఇచ్చాడు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus