కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా మొత్తానికి మరో రికార్డును అందుకుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. మొదటిరోజే నెగిటివ్ టాక్ రావడం అలాగే 50% ఆక్యుపెన్సీతో కలెక్షన్స్ అందుకోవడం అంటే అంత సాధారణ విషయం కాదు. ఇక ఫైనల్ గా సినిమా బాక్సాఫీస్ వద్ద 200కోట్ల మార్క్ ను అందుకుంది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద విజయ్ 200కోట్లను అందుకోవడం ఇది నలుగవసారి.
విజయ్ గత సినిమాలు మెర్సల్, సర్కార్, బిగిల్ వంటి సినిమాలు ఈజీగా 200కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను అందుకోగా ఇప్పుడు మాస్టర్ సినిమా శనివారం నాటికి 211కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను అందుకుంది. తమిళనాడులోనే ఏకంగాక్ 110కోట్లను అందుకోవడం విశేషం. దాదాపు సినిమా పెట్టినపెట్టుబడిని వెనక్కి తెచ్చినట్లు సమాచారం. ఇక తెలుగులో అయితే 40శాతానికి పైగా లాభాలను కూడా అందించింది అంటే విజయ్ మార్కెట్ ఇక్కడ కూడా ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
రానున్న రోజుల్లో విజయ్ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని లాభాలను అందుకోవడం కాయంగా కనిపిస్తోంది. ఇక త్వరలో సినిమాను ఓటీటీలో విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!