Vijay Devarakonda: తన గత సినిమా ఫలితం పై విజయ్ దేవరకొండ కామెంట్స్..!

  • July 22, 2022 / 11:17 AM IST

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘లైగర్’ చిత్రం ఆగస్టు 25న విడుదల కాబోతుంది. అదే డేట్ కి గతంలో ‘అర్జున్ రెడ్డి’ చిత్రం రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. కాబట్టి ‘లైగర్’ కూడా ‘అర్జున్ రెడ్డి’ లానే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని చిత్రబృందం తో పాటు అటు ఇండస్ట్రీ వర్గాలు.. ఇటు అభిమానులు ఆశిస్తున్నారు. ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకర్షించడంతో కచ్చితంగా ‘లైగర్’ పై అంచనాలు పెరిగాయి.

ఇదిలా ఉండగా.. ట్రైలర్ లాంచ్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ … ” అభిమానుల మెంటల్ మాస్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అసలు ఏం అర్థమైతలేదు. రెండేళ్లు అవుతుంది సినిమా విడుదలై.అంతకు ముందు రిలీజైన సినిమా పెద్ద చెప్పుకునే సినిమా కాదు. అయినా లైగర్ ట్రైలర్ కి అభిమానులు రచ్చ చూస్తుంటే మెంటలెక్కిపోతుంది” అంటూ అతను చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయిపోయింది. విజయ్ దేవరకొండ గత చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’.

2020 ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అయ్యింది. అభిమానులు కూడా భారీగా డిజప్పాయింట్ అయ్యారు.’వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో పాజిటివ్ గురించి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ హాఫ్ లో ఐశ్వర్య రాజేష్ చేసిన సువర్ణ ట్రాక్ గురించి చెప్పుకోవాలి. విజయ్ ఫ్యాన్ బేస్ కూడా ఆ మూవీని కాపాడలేకపోయాయి.ఆ చిత్రం వల్ల బయ్యర్స్ భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.18 కోట్ల వరకు ఈ చిత్రం నష్టాన్ని మిగిల్చింది ఆ చిత్రం.

అయితే ఆ సినిమా ప్రమోషన్ల టైంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ అని విజయ్ చెప్పాడు. సినిమా కూడా ఎపిక్ గా నిలుస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా ‘లైగర్’ ట్రైలర్ లాంచ్ లో విజయ్ చేసిన కామెంట్స్ ను.. ఆ(వరల్డ్ ఫేమస్ లవర్ టైం లో) టైంలో చేసిన కామెంట్స్ ను గుర్తు చేసుకుంటున్నారు కొందరు నెటిజన్లు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus