Vijay Devarakonda: ‘లైగర్‌’ ఫ్లాప్‌పై తొలిసారి స్పందించిన విజయ్‌!

Advertisement

‘వాట్‌ లగా దేంగే’, ‘దేశాన్ని షేక్‌ చేస్తాం’… అంటూ ఆగస్టు 25న ‘లైగర్‌’గా వచ్చాడు విజయ్‌ దేవరకొండ. సినిమాకు ఎంత హైప్‌ ఇచ్చారో, అంత ఫ్లాప్‌ అయ్యింది. ఆ సినిమా తర్వాత విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. హిట్‌ కొట్టి ఉంటే.. అంత యాటిట్యూడ్‌ చూపించొచ్చు.. ఫ్లాప్‌ సినిమా అంత సీన్‌ ఎందుకు అంటూ బాహాటంగా కొంతమంది ఫ్యాన్స్‌ విజయ్‌ దేవరకొండను ట్రోల్‌ చేశారు. అయితే సినిమా ఫలితం మీద విజయ్‌ దేవరకొండ ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదు.

అయితే తాజాగా సినిమా ఫలితంపై విజయ్‌ దేవరకొండ మాట్లాడారు. అయితే నిజానికి ఇది తాజాగా రియాక్షన్‌ కాదు. ఆ మధ్య కొన్ని రోజుల క్రితం మాట్లాడారు. ‘లైగర్‌’ ఫ్లాప్‌ తర్వాత మొదటిసారి సైమా వేడుకలో పాల్గొన్నాడు విజయ్‌. గత నెలలో జరిగిన ఈ వేడుక వీడియోలు తాజాగా బయటకు వచ్చాయి. ఆ అవార్డ్స్‌లో భాగంగా ‘యూత్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది సౌత్‌ ఇండియన్‌ సినిమా’ అవార్డును విజయ్‌ అందుకున్నాక.. ‘లైగర్‌’ ఫ్లాప్‌పై స్పందించారు.

‘‘గొప్ప సినిమాలతో ఈ ఏడాది చిత్రపరిశ్రమను అందరూ ముందుకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో నేను కూడా మంచి హిట్‌ సినిమాను ఇవ్వడానికి ప్రయత్నించాను. దాని కోసం చాలా కష్టపడి పనిచేశాను. కానీ మా సినిమా ఆ విజయాన్ని ఇవ్వడానికి సరిపోలేదు. నటులు అందరికీ మంచి రోజులు, చెడ్డ రోజులు ఉంటాయి. ఎలాంటి రోజుల్లోనైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనం చేయాల్సిన పనులన్నింటినీ జాగ్రత్తగా పూర్తి చేయాలి అంటూ వేదాంతం వల్లించాడు విజయ్‌.

అంతేకాదు.. నిజం చెప్పాలంటే నేను ఈ కార్యక్రమానికి రాకూడదనుకున్నా. కానీ అందరికీ ఓ మాట ఇవ్వడం కోసమే ఇక్కడికి వచ్చా. అభిమానులు, కుటుంబం, స్నేహితుల్ని అలరించేందుకు మరింత కష్టపడి పనిచేస్తా అని విజయ్‌ దేవరకొండ మాట ఇచ్చాడు. ‘లైగర్‌’ ఫ్లాప్‌ తర్వాత అప్పటికే పూరి జగన్నాథ్‌తో స్టార్ట్‌ అయిన ‘జేజీఎం’ను ఆపేశారని టాక్‌ నడుస్తోంది. ఈ సినిమా గురించి అయితే విజయ్‌ ఏం చెప్పలేదు. కొత్త సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం విజయ్‌ ‘ఖుషి’లో నటిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత కథానాయిక.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news