చిలికి..చిలికి గాలివాన పెద్ద తుఫాన్ గా మారింది అనట్లు చిన్నచిన్నగా ప్రారంభమైన గోడవ పెద్దదిగా మారుతోంది. యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ట్వీట్ల వర్షం ఇప్పటికీ ఆగలేదు. శుక్రవారం రాత్రి మొదలైన ఈ దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓ యువ హీరో (విజయ్ దేవరకొండ) కథానాయకుడి పేరు ముందు ది అని పెట్టుకోవడాన్ని ఉద్దేశిస్తూ ‘పైత్యం ఎక్కువైంది’ అంటూ ఆమె చేసిన ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆ హీరో అభిమానులు అనసూయపై ట్రోలింగ్ మొదలుపెట్టారు.
ఓ అభిమాని అసభ్య పదజాలంతో కామెంట్ చేయగా, దానికి అనసూయ అభిమానుల్లో ఒకరు సున్నితంగానే చురకలు అంటించారు. ‘‘మీరెవరో చాలా గొప్ప అభిమానిలాగా ఉన్నారు. చాలా బాగా మాట్లాడుతున్నారు. ప్రతిఘటించడానికి తిట్టాల్సిన అవసరం లేదు. ఆ భాష నాకూ వచ్చు. కానీ ఎలా పడితే అలా మాట్లాడటానికి నేను మీ అంత గొప్ప వీరాభిమానిని కాదు. నాకు సంస్కారం ఉంది’ అని కౌంటర్ ఇచ్చారు. దీనిపై అనసూయ స్పందిస్తూ ‘చాలా మందిని నిద్రలేపటానికి ఇదే సరైన మార్గం.
నా అభిమాన ఫ్యాన్ పేజీల అడ్మిన్ గురించి నాకు తెలియదు. ఇతరుల్లా కాకుండా నా ప్రభావం చాలా మందిపై ఉన్నందుకు గర్వపడుతున్నా. అందరితోనూ దీనికి పోలిక లేదు. ఇదొక ఆప్షన్ అని మాత్రమే చెబుతున్నా. అబిమానులు చేస్తున్న ఈ రచ్చను ఏ హీరో ప్రశ్నించడు. ఏ స్టార్ హీరో ఎందుకు వకాల్తా తీసుకోరో నాకైతే తెలీదు. గొప్ప బాధ్యత నుంచే గొప్ప శక్తి వస్తుంది. నేను బాధ్యతగా ఉండబట్టే, నా వంతు ప్రభావం చూపిస్తున్నా. ఇతరులనుచ విమర్శించే అభిమానులు లేకపోవడమే మంచిది’’ అని ట్వీట్‌లో పేర్కొంది.
అయితే అనసూయ ట్వీట్లకు పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ‘అందరి అటెన్షన్ మీపై ఉండడం కోసం ఇలా ట్వీట్ల యుద్ధం మొదలపెడతారని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, మీ పేరు పక్కన కూడా ‘ది’ అని పెట్టుకోండి… అంత నొప్పి ఎందుకు’ అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. ఇంకొకరు. ‘ఆన్‌లైన్‌లో పేరు, ఊరు లేని గ్రూప్‌ల కోసం ఎవరూ వకాల్తా తీసుకోరు.
అలా చేసే అభిమాని పేరుతో ఇతరులు చేసే పనుల్ని కూడా నెత్తిన వేసుకోవలసి వస్తుందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. చిన్న విషయాన్ని ఎందుకంత వివాదం చేస్తున్నారు? ట్విట్టర్‌లో ఏదో ఒకటి వాగడం, ఫ్యాన్స్ హర్ట్ అయ్యి ట్రోల్ చేస్తే స్టార్లు వచ్చి మీ కోసం స్టాండ్ తీసుకోవాలా? వాళ్లకు పనీపాట ఏమీ లేదా? అని అనసూయపై (Anasuya) మండిపడ్డారు.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?