డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో రష్మిక రణబీర్ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం యానిమల్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి రోజు 110 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది. రష్మికకు ఇది మొట్టమొదటి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పాలి. ఈ సినిమాలో రష్మిక రణబీర్ నటన అద్భుతం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో రష్మిక కాస్త బోలెడు సన్నివేశాలలో నటించిన ఈ సీన్స్ చూసినటువంటి దర్శక నిర్మాతలు అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. అయితే రష్మిక నటించినటువంటి ఈ బోల్డ్ సీన్స్ పై తాజాగా విజయ్ దేవరకొండ పాజిటివ్గా స్పందించారనీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి విజయ్ దేవరకొండ మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉంది అనే విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే యానిమల్ సినిమాకు రష్మిక హీరోయిన్గా తీసుకోవాలని విజయ్ దేవరకొండనే సజెస్ట్ చేశారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అన్ని సన్నివేశాలలో రష్మిక ఎంతో అద్భుతంగా నటించారు అంటూ ఈయన రష్మిక నటనపై పాజిటివ్ గా స్పందిస్తూ కామెంట్లు చేశారని తెలుస్తుంది. ఇలా ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ ఇలా స్పందించడంతో ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.
రష్మిక విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి అలాంటిది ఆమె మరొక హీరోతో చాలా క్లోజ్ గా బోల్డ్ సన్నివేశాలలో నటించడంతో ఈయన ఆ సన్నివేశాలపై పాజిటివ్గా స్పందించడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా రష్మిక మొట్టమొదటిసారి ఒక బాలీవుడ్ హిట్ అందుకుందని చెప్పాలి. ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత క్రేజ్ పెరిగిపోతుంది.
యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!
దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!