Vijay Devarakonda: ఆ డ్యాన్స్ చెయ్యాలంటే ఏడుపొచ్చింది!

  • July 13, 2022 / 06:35 PM IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు అన్నిటినీ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటుంది.

మరోవైపు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో జనగణమన సినిమా కూడా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. ఇక లైగర్ సినిమా ఈనెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అక్డీ పక్డీ పాటను విడుదల చేశారు. ఇక ఈ పాటలో విజయ్ దేవరకొండ తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఇకపోతే తాజాగా ఈ పాటపై విజయ్ దేవరకొండ స్పందించారు..విజయ్ దేవరకొండ నటనపరంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఈయనకు పెద్దగా డాన్స్ రాదు అందుకే ఎక్కువగా విజయ్ దేవరకొండ సినిమాలలో డాన్స్ చేయరు.

కానీ ఈ సినిమాలో ఈ పాట గురించి విజయ్ ఈ పాటకు కొరియోగ్రఫీ చూసిన తర్వాత ఏడుపొచ్చింది అయితే ఈ పాట షూట్ చేసిన తర్వాత బ్లాస్ట్ అయ్యిందని విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా ఈ పాట గురించి కామెంట్స్ చేశారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus