విజయ్ దేవరకొండ కు యూత్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి విజయ్ దేవరకొండ హీరోగా చేసిన 9 సినిమాల్లో ‘పెళ్లి చూపులు’ ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ ‘టాక్సీవాలా’ సినిమాలు తప్ప మిగిలిన అన్ని సినిమాలు సరిగ్గా ఆడలేదు. అయినప్పటికీ అతని క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ నుండీ ఇటీవల వచ్చిన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా విడుదలైన ఈ చిత్రం పెద్ద ప్లాప్ అయ్యింది.
ఈ చిత్రాన్ని 30 కోట్లకు అమ్మితే కనీసం ఇంకా 10 కోట్ల షేర్ కూడా రాలేదు. మొన్న రిలీజ్ అయిన ‘భీష్మ’ దెబ్బకు ఈ చిత్రం దాదాపు షెడ్డుకి వెళ్లిపోయిందని చెప్పొచ్చు. అయితే ఈ చిత్రం నష్టాలను పూడ్చడానికి విజయ్ దేవరకొండ పారితోషికంతో సగం వెనక్కి ఇచ్చేశాడట. అయితే మిగిలిన 20 కోట్లకు పైనే ఎలా అడ్జస్ట్ చెయ్యాలి అనేది నిర్మాత కె.ఎస్.రామారావుకు అర్థం కావడం లేదట. అసలే ఆయన ఈ మధ్య తీసిన సినిమాలు ఒక్కటి కూడా హిట్ అవ్వడం లేదు. దీంతో తరువాతి సినిమాని తక్కువ రేట్లకి ఇస్తాను అని చెప్పినా డిస్ట్రిబ్యూటర్లు వినని పరిస్థితి ఏర్పడిందని సమాచారం. విజయ్ దేవరకొండ క్రేజ్ ను నమ్మి డబ్బు పెడితే.. ఆ క్రేజ్ సినిమాను కొంచెం కూడా గట్టెక్కించలేకపోయాయని స్పష్టం అవుతుంది.
Most Recommended Video
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!