ప్లాప్ సినిమాకి 100 మిలియన్ వ్యూస్!

  • March 11, 2021 / 03:27 PM IST

టాలీవుడ్ లో సెన్సేషనల్ స్టార్ గా మారాడు విజయ్ దేవరకొండ. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అతడికి క్రేజ్ పెరిగింది. యూత్ లో ముఖ్యంగా అమ్మాయిల్లో విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజానికి విజయ్ కెరీర్ లో ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాల తరువాత ఆ రేంజ్ హిట్ పడకపోయినా.. అతడికి అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ రౌడీ హీరో నటించిన ఓ ప్లాప్ సినిమాకి 100 మిలియన్ వ్యూస్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ చివరిగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాశిఖన్నా, కేథరిన్ త్రెసా, ఐశ్వర్యా రాజేష్ లు హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

అయితే ఈ సినిమాను హిందీలో డబ్ చేసి విడుదల చేయగా.. యూట్యూబ్ లో ఈ సినిమా 100 మిలియన్ వ్యూస్ ని రాబట్టింది. బాలీవుడ్ లో కూడా విజయ్ కి క్రేజ్ ఉండడంతో ఈ 100 మిలియన్ రికార్డ్ దక్కిందంటూ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ హీరో నటిస్తోన్న ‘లైగర్’ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 9న ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus