ఓ హీరో కోసం అనుకున్న కథలో మరో హీరో వచ్చి చేరడం అనేది చాలా రొటీన్ విషయం. సినిమా పుట్టినప్పటి నుండీ ఇది జరుగుతున్న తంతే..! దర్శకులు ఓ కథ తయారు చేసుకుని ముందుగా స్టార్ హీరో వద్దకు వెళ్లడం అతను నొ చెబితే మీడియం రేంజ్ హీరోల వద్దకి వెళ్లి ఆ కథని ఓకే చేయించుకోవడం వంటివి మనం చూస్తూనే వస్తున్నాం. ఆ మీడియం రేంజ్ హీరోల కోసం స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి ఆ ప్రాజెక్టుని పట్టాలెక్కిస్తూ ఉంటారు దర్శకనిర్మతలు.
కానీ మనం ఇప్పుడు మాట్లాడుకునేది పూర్తిగా రివర్స్ అనే చెప్పాలి. ఓ దర్శకుడు కథ సిద్ధం చేసుకుని ముందుగా మీడియం రేంజ్ హీరో వద్దకి వెళ్లి.. దానిని వినిపించి అతను కాదంటే ఆ తర్వాత సీనియర్ స్టార్ వద్దకి వెళ్లి ఆ కథని ఓకె చేయించుకున్నాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు బాబి.అతను తెరకెక్కించిన 3 సినిమాల్లో 1 డిజాస్టర్, 2 హిట్లు. అయినప్పటికీ చిరుతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడు బాబీ. అది కూడా విజయ్ దేవరకొండ కోసం అతను రెడీ చేసుకున్న కథతో.!
వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజం..! ‘గీత గోవిందం’ తర్వాత ఓ కథ రెడీ చేసుకుని వెళ్లి విజయ్ ను కలిసాడు బాబీ.అతని కాల్ షీట్లు ఖాళీ లేకపోవడంతో అతను బాబీ మూవీకి నో చెప్పాడు. అయితే అనూహ్యంగా బాబీకి చిరుతో సినిమా చేసే అవకాశం రావడంతో.. విజయ్ కోసం అనుకున్న కథనే కొంచెం అటూ ఇటూ మార్చి చిరుకి చెప్పి ఓకే చేయించుకున్నాడు. ఈ విషయంలో బాబీ గ్రేట్ అనే చెప్పాలి.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!