Vijay Sethupathi: ఈ ఫోటోలోని ఇద్దరు స్టార్స్‎ని గుర్తుపట్టారా..14ఏళ్ల నాటి ఫోటోను షేర్ చేసిన స్టార్ హీరో!

నేటి సమాజంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దానికి తోడు స్మార్ట్ ఫోన్ల రాకతో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. దీంతో సామాన్యులు సైతం ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన విషయాలు పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ సెలబ్రిటీలు కూడా తమ వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర విషయాలను వారి అభిమానుల కోసం అప్పుడప్పుడు బయటకి రివీల్ చేస్తున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నటన పై ఆసక్తితో సిని పరిశ్రమలోకి వచ్చి ఆ తర్వాత తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు.

ఒకప్పుడు చిన్న చిన్న గదులలో కూడా.. అద్దె కూడా కట్టలేని స్థితిని అనుభవిస్తూ.. ఆకలేస్తే నీళ్లు తాగి కడుపు నింపుకున్న విషయాలను స్టార్స్ అయి ఓ పొజిషన్ కు వెళ్లిన తర్వాత గుర్తుకు తెచ్చుకుంటారు. ఇప్పుడు తాజాగా అలాంటి ఓ స్టార్ తనకు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది తెగ వైరల్ అవుతోంది. పైన చూపిన ఫోటోల్లో ఇద్దరు స్టార్స్ ఉన్నారు.. అందులో ఒకరు పాన్ ఇండియా సూపర్ స్టార్ కాగా మరొకరు సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్.

వారెవరో ఇప్పటికైనా గుర్తు పట్టారా. అందులో ఒకరు (Vijay Sethupathi) విజయ్ సేతుపతి.. మరొకరు అట్ట కత్తి సినిమాతో పాపులర్ అయిన దినేష్. సరిగ్గా 2009 అక్టోబర్ 9న తీసిన ఇది. ఈ ఫోటో తీసి ఇప్పటికీ దాదాపుగా 14 ఏళ్లు కావొస్తుంది. తమిళ నటుడు రియాజ్ .. దినేష్ బర్త్ డే సందర్భంగా తీసిన ఫోటో అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోను బట్టి చూస్తే గతంలో వీరిద్దరూ కలిసి ఒకే సినీ ప్రయాణం మొదలు పెట్టారని తెలుస్తోంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus