విజయ్ సేతుపతి ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు ఓకే చేసుకొని తర్వాత తప్పుకుంటున్నాడు. తెలుగులో ‘పుష్ప’ ఓకే చేశాడు అని అనుకుంటుండగా.. లేదు అని వార్తలొచ్చాయి. హిందీలో ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. అందులోంచి కూడా తప్పుకుంటున్నట్లు ఇటీవల విజయ్ ప్రకటించాడు. అయితే సినిమా బృందం విజయ్‌ను తప్పించిందని వార్తలొచ్చాయి. దీంతో మక్కల్ సెల్వన్ అభిమానులు మనసు నొచ్చకుంది. దీనిపై విజయ్ సేతుపతి తాజాగా స్పందించారు. ‘లాల్ సింగ్ చద్ధా’ నుండి విజయ్ సేతుపతి అకస్మాతుగా తప్పుకోవడంతో చాలా ఊహాగానాలు వినిపించాయి.
బరువు పెరిగిపోయారనే కారణంతో ఈ చిత్ర దర్శకుడు, ఆమిర్.. ఆయన్ను తొలగించారనే వార్త వైరల్ అయ్యింది. ఈ విషయమై ఆమిర్,సేతుపతికి మధ్య విబేధాలు వచ్చాయనేది ఆ పుకార్ల సారాంశం. దీంతో ఈ పుకార్లపై విజయ్ సేతుపతి స్పందించాడు. “నా శరీరం, మెదడు నా అధీనంలోనే ఉన్నాయి. నా శరీరాకృతి గురించి పట్టించుకోవద్దు. ఈ సినిమా కథ ఆమిర్ అద్భుతంగా చెప్పారు. ఆ తర్వాత నటించడానికి ఒప్పుకున్నాను. అప్పుడే లాక్‌డౌన్ విధించారు. దాంతో నా డేట్స్ అంతా గందరగోళంగా మారిపోయాయి. తెలుగులో ఐదు సినిమాలు చేయాల్సి వచ్చింది. దాంతో ‘లాల్ సింగ్ చద్ధా’కు డేట్స్ కేటాయించలేకపోయాను. అందుకే సినిమా చేయలేకపోయాను” అని విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చాడు.
సినిమా చర్చలు అయ్యి, ఓకే అన్నాక విజయ్ సేతుపతి రెండుసార్లు ముంబయికి వెళ్లారట. ఆ సమయంలో ఆమిర్ ఖాన్ స్వయంగా ఇంటికి ఆహ్వానించారట. అంతేకాదు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారట. ఆమిర్ చూపిన చొరవ, మర్యాదను ఎప్పటికీ మరిచిపోలేను అంటూ విజయ్ ఆనందంగా చెప్పుకొచ్చాడు. భవిష్యత్‌లో ఆమిర్‌తో నటించాలని ఉంది. అవకాశం వస్తే విడిచి పెట్టను అని విజయ్ సేతుపతి అంటున్నాడు. అన్నట్లు ఈ పాత్రకు నాగచైతన్యను తీసుకున్నారని వార్తలొచ్చాయి. అయితే దీనిపై రెండు వర్గాల నుంచి క్లారిటీ లేదు.
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?