‘ఉప్పెన’ డైరెక్టర్ కి నెటిజన్ల సలహా!

  • February 5, 2021 / 07:05 PM IST

మెగాస్టార్ చిన్న మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. అలానే విలన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించారు. ఫిబ్రవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఎమోషన్స్ తో పాటు డార్క్ నెస్ కి పెద్ద పీట వేస్తూ ఈ ట్రైలర్ ని కట్ చేశారు.

ట్రైలర్ చూసిన వారంతా కూడా ఈ సినిమాను ఓటీటీ రిలీజ్ కు ఇవ్వకుండా మంచి పని చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఎమోషనల్ డ్రామాను తెరపై చూడడానికి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ట్రైలర్ లో విజయ్ సేతుపతికి డబ్బింగ్ సరిగ్గా కుదరలేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లో విజయ్ సేతుపతికి డబ్బింగ్ చెప్పిన వ్యక్తితో కాకుండా.. నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ తో విజయ్ సేతుపతి పాత్రకు డబ్బింగ్ చెప్పించారు. వాయిస్ లో ఇంటెన్సిటీ ఉండడం కోసం రవి శంకర్ ను ఎన్నుకున్నారు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus