Vijay Thalapathy: స్టార్ హీరో విజయ్ కొనుగోలు చేసిన కొత్త కారు ఖరీదు అన్ని కోట్లా?

Ad not loaded.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్  (Vijay Thalapathy) ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. విజయ్ ఇటీవల తన రెండు కార్లను అమ్మేయడం ఒకింత సంచలనం అయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉన్న విజయ్ తాజాగా లగ్జరీ కారును కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ద గోట్ (The GOAT)  సినిమాలో ఈ సినిమాలో నటిస్తున్న ఈ హీరో రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో రాజకీయాలకు పరిమితం కానున్నారు.

Vijay Thalapathy

తమిళగ వెట్రి కళగం పేరుతో విజయ్ కొత్త పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. లగ్జరీ కార్లను ఇష్టపడే ఈ స్టార్ హీరో పాత కార్లను అమ్మేసినా లెక్సెస్ ఎల్ ఎమ్ కారును కొనుగోలు చేయడం జరిగింది. ఈ కారులో విజయ్ బయటకి వస్తున్న వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఈ కారు ఖరీదు కోటిన్నర రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని సమాచారం అందుతోంది.

విజయ్ తీసుకునే పారితోషికంతో పోల్చి చూస్తే ఈ కారు ఖరీదు మరీ ఎక్కువ మొత్తం కాదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయ్ కొత్త కారును కొనుగోలు చేయడం వెనుక అసలు కారణాలు తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. విజయ్ రాజకీయాలలో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది. విజయ్ సీఎం కావడం పక్కా అని అభిమానులు కామెంట్లు చేసుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విజయ్ తెలుగులో ఊహించని స్థాయిలో మార్కెట్ ను పెంచుకోగా ఇతర భాషల్లో సైతం విజయ్ తన మార్కెట్ ను పెంచుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. విజయ్ వయస్సు 50 సంవత్సరాలు కాగా విజయ్ కు సినిమాలలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ పొలిటికల్ గా ఎంతవరకు పనికొస్తుందో చూడాల్సి ఉంది. విజయ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.

రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న నాగార్జున బ్లాక్‌బస్టర్‌… ఎప్పుడంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus