Mahesh Babu: మహేష్ బాబు ఫోన్ వాల్ పేపర్ చూశారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  ఈ ఏడాది ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా అంచనాలకు తగ్గట్టు ఆడకపోయినా.. పర్వాలేదు అనిపించింది. దాని తర్వాత రాజమౌళి  (Rajamouli)  దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, ప్రాజెక్టు కన్ఫర్మ్ అని అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు.. కన్ఫర్మ్ చేశారు. మహేష్ బాబు తన లుక్ ను కూడా కంప్లీట్ గా మార్చుకోవడం జరిగింది.

Mahesh Babu

ఇక రెండు రోజుల క్రితం మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘మురారి’ (Murari) చిత్రం 4K లో రీ- రిలీజ్ అయ్యింది. దానికి భారీ కలెక్షన్స్ నమోదైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. మహేష్ బాబు నిజజీవితంలో చాలా సింపుల్ గా ఉంటారు. పెద్దగా హడావిడిగా రెడీ అవ్వడాలు వంటివి ఉండవు.సింపుల్ గా ప్లేన్ షర్ట్…లు, ప్లేన్ టీ- షర్ట్..లు వేస్తుంటాడు. ఇంకోటి ఫోన్లకు కూడా అతను చాలా దూరంగా ఉంటాను అని చెబుతుంటాడు.

అందువల్ల చాలా ప్రశాంతంగా ఉంటుందని అంటుంటాడు. ఇదిలా ఉండగా.. మహేష్ బాబు ఫోన్ వాల్ పేపర్ పిక్ ఒకటి వైరల్ అవుతుంది. అది ఏమయ్యి ఉంటుంది? అనేది ఎవర్నైనా గెస్ చేయమంటే… బహుశా సితార ఫోటోనో? గౌతమ్ ఫోటోనో? లేదంటే భార్య నమ్రత (Namrata Shirodkar) , పిల్లలు కలిపి ఉన్న ఫోటోని ఉంటుందేమో? అని అంతా అనుకుంటారు.కానీ ఎర్త్ (గ్లోబ్) పిక్ ఉంది. అందులో ఇండియా మ్యాప్ కూడా కనిపిస్తుంది.

లక్ష్మీ ప్రణతి సీక్రెట్స్ ను రివీల్ చేసిన నార్నె నితిన్.. అలా చెప్పడంతో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus