LEO Movie: బుకింగ్స్ లో సంచలనాలు సృష్టిస్తున్న లియో.. ఏం జరిగిందంటే?

  • October 17, 2023 / 07:25 PM IST

విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లియో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని విజయ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో లియో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా హక్కులను సితార సంస్థ 18 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ సినిమాతో సితార నిర్మాతలకు విక్రమ్ ను మించిన లాభాలు ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బుక్ మై షోలో ఈ సినిమాకు ఏకంగా 13 లక్షల లైక్స్ వచ్చాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. లియో సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలోనే థియేటర్లు దక్కాయని తెలుస్తోంది. భగవంత్ కేసరికి ఇబ్బంది కలగకుండా ఈ సినిమాకు థియేటర్లు కేటాయించారని భోగట్టా. లియో ఫస్ట్ డే కలెక్షన్లు సైతం భారీ స్థాయిలోనే ఉండే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది.

విజయ్ కు జోడీగా ఈ సినిమాలో త్రిష నటించారు. (LEO Movie) లియో సినిమాలో మొదటి 10 నిమిషాలు వేరే లెవెల్ లో ఉంటుందని సమాచారం అందుతోంది. విజయ్ కెరీర్ కు ప్రస్తుత పరిస్థితుల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆ లోటును తీరుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లియో తమిళంలో సైతం సంచలనాలు సృష్టిస్తోంది. వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా హిందీలో మాత్రం రిలీజ్ కావడం లేదు.

ఓటీటీ నిబంధనలు ఈ సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ కు అడ్డు పడ్డాయని తెలుస్తోంది. లియో మూవీ ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. విజయ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై సైతం అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus