Bobby, Balayya Babu: బాలయ్య బాబీ కాంబో మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఎవరంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉంటూ కెరీర్ ను వేరే లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. బాలయ్య నటించిన భగవంత్ కేసరి ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోందని తెలుస్తోంది. మరోవైపు ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రష్మిక చెప్పిన ఆసక్తికర విషయాలు, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమా గురించి ఇచ్చిన అప్ డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

మరోవైపు బాలయ్య బాబీ మూవీలో విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమాలో అర్జున్ రాంపాల్ విలన్ గా నటించగా ఈ సినిమా కోసం మరో బాలీవుడ్ నటుడిని రంగంలోకి దించుతూ అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. మరోవైపు బాలయ్య బాబీ కాంబో మూవీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోందని ఈ సినిమా కాన్సెప్ట్ వేరే లెవెల్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

బాలయ్య బాబీ (Bobby, Balayya Babu) కాంబో మూవీ పాన్ ఇండియా సినిమాగా విడుదలైతే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. బాలయ్య సినిమా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు వరుసగా సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాతలు నిర్మించిన ఆదికేశవ తాజాగా థియేటర్లలో విడుదలైంది.

ఈ వీకెండ్ కు రిలీజైన సినిమాలలో ఇదే భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. సితార నిర్మాతలు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లను నిర్మిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ నిర్మాతలు నిర్మించిన సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus