Keerthy Suresh: ‘సర్కారు వారి పాట’ కొత్త పిక్‌ చూశారా!

  • August 10, 2021 / 03:23 PM IST

కొన్నిసార్లు టీజర్‌, ట్రైలర్‌లోని పంచ్‌ డైలాగ్‌ల కంటే, సాధారణ డైలాగ్‌లే హైలైట్‌ అవుతూ ఉంటాయి. ‘సర్కారు వారి పాట’ టీజర్‌లో ‘దిష్టి తీయండి’ డైలాగ్‌ కూడా అలాంటిదే. డైలాగ్‌ చెప్పింది హీరోయినే కావొచ్చు… కానీ అందులో పొగిడింది, హైలైట్‌ అయ్యింది హీరోనే. అందుకేనేమో అంతగా పాపులర్‌ అయిపోయింది ఆ డైలాగ్‌. దాన్ని అభిమానులు తెగ వాడేస్తున్నారు. అయితే సోమవారం రాత్రి కీర్తి సురేశ్‌ ఓ ట్వీట్‌ చేస్తూ… అదే డైలాగ్‌ రాసింది. ఆ పిక్‌, డైలాగ్‌ మళ్లీ వైరల్‌ అయ్యింది.

సినిమా టీజర్‌ /బ్లాస్టర్‌ కీర్తి సురేశ్‌, మహేష్‌బాబు పక్కపక్కన ఉన్న ఫ్రేమ్‌ ఒకటే కనిపిస్తుంది. అది కాకుండా మరో ఇంట్రస్టింగ్‌ పిక్‌ను కీర్తి సురేశ్‌ ట్వీట్‌ చేసింది. దాంతోపాటు ‘నమ్రత మేడమ్‌, సర్‌ పడుకునే ముందు ప్రతిరోజు దిష్టి తీయడం మరచిపోకండి’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. సినిమాలోనే కాదు… బయట కూడా మా బాబుకి దిష్టి తీయాల్సిందే అని అభిమానులు ఆనందపడుతున్నారు.

ఇక టీజర్‌/బ్లాస్టర్‌ గురించి చూస్తే… మహేష్‌బాబు మళ్లీ ప్రేక్షకుల్ని ‘పోకిరి’ రోజులకు తీసుకెళ్లిపోయాడు అనే చెప్పాలి. ఆ హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌ ఇలా అన్నీ అప్పటి మహేష్‌ను చూస్తున్నట్లే ఉందని అభిమానులు సోషల్‌ మీడియాలో మురిసిపోతున్నారు. విడుదలైన 24 గంటల్లోనే 25.7 మిలియన్ల వ్యూస్‌, 7,54,000 లైక్‌లు సంపాదించింది. ఇంకా ఈ జోరు కొనసాగుతోంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus