PC Sriram: వైరల్‌ పిక్స్‌: పీసీ శ్రీరామ్‌ మ్యాజిక్‌

ఎందుకో మరి.. పీసీ శ్రీరామ్‌ చూడటానికి చాలా సీరియస్‌ ఉంటారు. అదేంటి ఆయనకు కోపం ఎక్కువా? అని అనుకునేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఆయనంతే. కానీ ఆయన కెమెరా ఎప్పుడూ కోపంగా ఉండదు. అందాల్ని బందిస్తూ బిజీగా ఉంటుంది. మేం చెబుతున్నది సినిమాలు చిత్రీకరించడానిక వాడే కెమెరా గురించి కాదు. ఫొటోలు తీసే కెమెరా గురించి. ఆయన ఎంత మంచి సినిమాటోగ్రాఫరో, అంతే మంది ఫొటో గ్రాఫర్‌. దానికి ఆయన క్లిక్‌ మనిపించిన ఫొటోలే రుజువు. తాజాగా అలాంటి కొన్ని ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

పీసీ శ్రీరామ్ ప్రస్తుతం ‘థ్యాంక్‌ యూ’ అనే సినిమాను పని చేస్తున్నారు. విక్రమ్ కె.కుమార్‌, నాగచైతన్య కాంబోగా రూపొందుతున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మిలన్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన తీసిన కొన్ని ఫొటోలే ప్రస్తుతం వైరల్‌ అవుతున్నవి. ఆ ఫొటోల్లో ఉన్నది నాగచైతన్య,, రాశీ ఖన్నా, అవికా గోర్‌. అయితే వీటిని పీసీ శ్రీరామ్‌ మొబైల్‌ కెమెరాతో తీసినవని తెలుస్తోంది. మొబైల్‌ కెమెరా అయితే ఏముంది.. ఆయన చేతిలో మాయ ఉంటేను.

పీసీ శ్రీరామ్ ట్విటర్‌ , ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలు ఓపెన్‌ చేస్తే ఆ ఇంట్రెస్టింగ్‌ ఫొటోలు మీరూ చూడొచ్చు. నాగచైతన్య ఫొటో, రాశీఖన్నా అందమైన కళ్లు, చిరు చీకటిలో అవికా గోర్‌ ఫొటో మీకు కనిపిస్తాయి. వీటితోపాటు పీసీ శ్రీరామ్‌ వెరైటీ ఫొటోలు మీరు కూడా చూడొచ్చు. అందులో కొన్ని ఫొటోలు మీకోసం ఇక్కడ.

1

2

3

4

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus