Virat Kohli, Jr NTR: ఎన్టీఆర్ నాకు మంచి ఫ్రెండ్.. విరాట్ కోహ్లీ కామెంట్స్ వైరల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమా ఇండస్ట్రీలో అందరివాడిగా పేరు సంపాదించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో హిట్ సినిమాలలో నటించగా ఆ సినిమాల వల్ల ఇతర భాషల్లో సైతం తారక్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే విరాట్ కోహ్లీ సైతం తారక్ కు వీరాభిమాని అని తెలిసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది. విరాట్ కోహ్లీ స్వయంగా ఈ విషయాలను వెల్లడించి నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేశారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి ఫిదా అయ్యానంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చారు.

టాలీవుడ్ స్టార్ హీరోలలో తారక్ తన బెస్ట్ ఫ్రెండ్ అని విరాట్ అన్నారు. ఒక యాడ్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పని చేయాల్సి వచ్చిందని యాక్టర్ గా కూడా జూనియర్ ఎన్టీఆర్ ను ఎంతో అభిమానిస్తానని విరాట్ కోహ్లీ అన్నారు. యాడ్ షూట్ సమయంలో తారక్ యాక్టింగ్ చూసి ఫిదా అయ్యానని ఆయన చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఇతరులతో ఆప్యాయంగా మాట్లాడతారని తారక్ లో ఆ లక్షణం ఎంతో నచ్చుతుందని విరాట్ కోహ్లీ పేర్కొన్నారు.

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ (RRR) మూవీలో జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఎంతో నచ్చిందని ఆయన వెల్లడించారు. నాటు నాటు సాంగ్ డ్యాన్స్ స్టెప్స్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయని విరాట్ అభిప్రాయపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ తో వీడియో కాల్స్ మాట్లాడతానని విరాట్ పేర్కొన్నారు. విరాట్ చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతవుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర (Devara) , వార్2, ప్రశాంత్ నీల్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యత ఇస్తున్న ఎన్టీఆర్ క్వాలిటీ సినిమాలలో నటిస్తూ అభిమానులను మెప్పిస్తున్నారు. సినిమా సినిమాకు నటుడిగా అంతకంతకూ ఎదుగుతున్న తారక్ తన యాక్టింగ్ స్కిల్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus