బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో వీవీ వినాయక్ తెరకెక్కించిన ఛత్రపతి సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో వినాయక్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సుమోలను పేల్చడం అప్పట్లో సరదాగా చేశానని వినాయక్ అన్నారు. దిల్ రాజు గారు ప్రొడక్షన్ లోకి రావడానికి నేను కారణం కాదని వినాయక్ తెలిపారు.
దిల్ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో చేయకపోయినా ఆయన దగ్గర పనిచేసిన దర్శకులలో చాలామంది నా నుంచి వెళ్లిన వాళ్లే అని వినాయక్ చెప్పుకొచ్చారు. దిల్ రాజు కొత్త డైరెక్టర్లతో బాగా పని చేయించుకుంటారని వీవీ వినాయక్ కామెంట్లు చేశారు. ఆది సినిమా సమయంలో కెమెరామేన్ రామ్ ప్రసాద్ తో ఎలాంటి గొడవ లేదని ఆయన తెలిపారు. రామ్ ప్రసాద్ వేరే సినిమాకు కమిట్ కావడంతో ఆది వదిలేశారని అది చిన్న ఇష్యూ అని ఆది మూవీ మధ్యలో ఉన్న సమయంలో రామ్ ప్రసాద్ మళ్లీ జాయిన్ అయ్యారని వినాయక్ చెప్పుకొచ్చారు.
రామ్ ప్రసాద్ తో నాకు కంఫర్ట్ అని ఆయన పేర్కొన్నారు. బాలయ్యతో చెన్నకేశవరెడ్డి తర్వాత మరో సినిమా తీయకపోవడం గురించి వినాయక్ స్పందిస్తూ బాలయ్య అభిమానులకు ఆ సినిమా చాలా ఇష్టమని అన్నారు. చెన్నకేశవరెడ్డి తర్వాత ఎక్కడ కనిపించినా బాలయ్య సత్తిరెడ్డి అని పిలిచేవారని వినాయక్ తెలిపారు.
బాలయ్య సి.కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సినిమాను ప్లాన్ చేశామని కానీ కథ దొరకక ఆ సినిమా వర్కౌట్ కాలేదని ఆయన పేర్కొన్నారు. శీనయ్య సినిమా విషయంలో అసంతృప్తి వల్ల ఆ సినిమా ఆగిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. వినాయక్ (Vv Vinayak) వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?