బిగ్ బాస్ 4 : నామినేషన్స్ తర్వాత ఏం జరిగింది..?

  • November 25, 2020 / 11:49 AM IST

బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం నామినేషన్స్ లో తనని కెప్టెన్ చేసిన మోనాల్ ని నామినేషన్స్ నుంచి సేఫ్ చేయలేదని హారిక గురించి అనుకున్నారు చాలామంది. అయితే, హాట్ స్టార్ అన్ సీన్ లో నామినేషన్స్ తర్వాత ఏం జరిగింది అనేది క్లియర్ గా చూపించాడు బిగ్ బాస్.

నామినేషన్స్ పూర్తి అయిన తర్వాత హారిక మోనాల్ తో బెడ్ దగ్గరకి వచ్చి మాట్లాడింది. నువ్వు స్వాప్ విత్ రైట్ పర్సన్ అని చెప్పింది అఖిల్ గురించా అని అడిగింది హారిక. అవును అంటూ చెప్పింది మోనాల్. అలా తెలిస్తే నువ్వు హ్యాపీ అవుతావ్ అని తెలిస్తే చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. కానీ, అక్కడ బలమైన రీజన్స్ చెప్పాలి కదా అంటూ మాట్లాడింది.

ఇక్కడే సోహైల్ కిచెన్ లో అవినాష్ తో ఈ విషయాన్ని చెప్పాడు. హారికకి చాలా టఫ్ సిట్యువేషన్ అని, అక్కడ మనం ఉంటే డెసీషన్ వేరేలా తీస్కునేవాళ్లమోమో అంటూ హారిక చేసింది చాలా జెన్యూన్ అని అన్నాడు. ఆ తర్వాత సోహైల్ -హారిక ఇద్దరూ కూడా గార్డెన్ ఏరియాలో కూర్చుని మాట్లాడుకున్నారు. ఇక్కడే హారిక తను ఎందుకు మోనాల్ ని సెలక్ట్ చేసుకున్నానో క్లియర్ గా చెప్పింది.

 

ఇది ఇంట్లో నుంచి ఒకళ్లని బయటకి పంపే ప్రక్రియ మాత్రమే కాదని, ఇంకొకరిని సేఫ్ చేయాల్సిన ప్రక్రియ కూడా అని అందుకే చాలా ఆలోచించి ఈ స్టెప్ తీస్కున్నానని చెప్పింది. అంతేకాదు, ఇప్పుడు వచ్చే కెప్టెన్సీ లో నేను అభిజిత్ కంటే కూడా మోనాల్ కే సపోర్ట్ చేస్తాను అంటూ చెప్పింది. తను రీజన్ లేకుండా ఎలా నీ పేరు చెప్తాను అంటూ సోహైల్ ని ప్రశ్నించింది. ఇది హాట్ స్టార్ అన్ సీన్ లో బిగ్ బాస్ రివీల్ చేశాడు.

అంతేకాదు, హారిక బాగా డిప్రెషన్ లోకి వెళ్తుంటే , మోనాల్ వచ్చి ఓదార్చడం, అఖిల్ – అభిజిత్ ని ఉద్దేశ్యించి అన్న మాటలు అన్నీ కూడా చూపించాడు బిగ్ బాస్. నామినేషన్స్ తర్వాత ఏం జరిగింది అనేది క్లియర్ గా ఆడియన్స్ కి అర్ధమయ్యేలా అన్ సీన్ లో చూపించారు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus