Ravi Teja: రవితేజ సినిమాకు ఆ పరిస్థితి వచ్చిందట… కారణమిదేనా!

  • September 20, 2021 / 12:27 PM IST

అప్పటివరకు బాగున్న సినిమా ఒక్కసారిగా డల్‌ అయిపోవడం చూసుంటారు. కానీ జోరు మీద సాగుతున్న సినిమా చిత్రీకరణ డల్‌ అయిపోవడం చూశారా? గతంలో ఇలాంటి సినిమాలు కొన్ని స్లో అయ్యాయి. తాజాగా ఆ సినిమాల జాబితాలో రవితేజ సినిమా కూడా చేరింది. అదే ‘ఖిలాడీ’. రెండో విడత కరోనా లాక్‌డౌన్‌ అయిపోగానే సినిమా చిత్రీకరణను వేగవంతం చేసినట్లు కనిపించారు. సినిమా ప్రచారం కూడా ఓవైపు మొదలుపెట్టారు. అయితే తాజా సమాచారం ప్రకారం చిత్రీకరణకు బ్రేక్‌లు పడ్డాయట.

బడ్జెట్‌, నిధులు విషయంలో ఇబ్బందులు వచ్చిన ‘ఖిలాడీ’ సినిమా ఆగిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఏమైందబ్బా అని రవితేజ అభిమానులు ఆలోచనలు మొదలుపెట్టారు. మరోవైపు అలాంటిదేం లేదు అనే చర్చ కూడా నడుస్తోంది. దానికి కారణంగా ఈ నిర్మాణ సంస్థ హవీష్‌ ప్రొడక్షన్‌ తర్వాతి సినిమాను భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కిస్తుండటమే. కొన్ని రోజుల క్రితం ‘రాక్షసుడు 2’ను ఈ బ్యానర్‌ మీదే ప్రకటించారు. అంత బడ్జెట్‌కు ముందుకొచ్చిన నిర్మాతలు రవితేజ సినిమా ఎందుకు ఆపేస్తారనేది ప్రశ్నగా మిగిలింది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus