రెక్కలు చూశాక కూడా టైటిల్‌ మీద డౌట్‌.. కొత్తగా చర్చల్లోకి మిక్సింగ్ నేమ్‌!

Ad not loaded.

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు  (Mahesh Babu)  – దర్శకధీరుడు రాజమౌళి (S. S. Rajamouli)  కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోకి గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇటీవలే సినిమాలోకి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్‌ జరుగుతోంది అని అంటున్నారు కానీ ఆ విషయంలో క్లారిటీ లేదు. త్వరలో విదేశాల్లో షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తున్నారు అని కూడా అంటున్నారు. త్వరలోనే క్లారిటీ వస్తుంది అనుకోండి. ఈ విషయం ఇటు తేలడం లేదు.. మరోవైపు కొత్త విషయం ఒకటి బయటికొచ్చింది.

Mahesh Babu, Rajamouli:

అదే సినిమా పేరు. ఈ సినిమాకు టైటిల్‌ ఏంటి? అనేది ఇప్పటివరకు టీమ్‌ ఎక్కడా చెప్పలేదు. అయితే ‘గరుడ’ అనే పేరు చాలా రోజులుగా చర్చలో ఉంది. కట్ చేస్తే ఇప్పుడు మరో పేరు వినిపిస్తోంది. అదే ‘మహరాజ్‌’. అంతేకాదు ఈ పేరు పెట్టడానికి ఓ మిక్సింగ్‌ కారణం కూడా చెబుతున్నారు. మహేష్‌బాబు – రాజమౌళి పేరు కలిపితే అది అని అంటున్నారు.

అంతేకాదు ఈ టైటిల్‌ విషయంలో టీమ్‌ చాలా ఆసక్తిగా ఉంది అని కూడా చెబుతున్నారు. త్వరలో సినిమా పేరును తెలియజేస్తూ ఓ మోషన్‌ పోస్టర్‌ కానీ, టీజర్‌ కానీ రిలీజ్‌ చేయాలని చూస్తున్నారని టాక్. ఆ ఈవెంట్‌లోనే సినిమా బేసిక్‌ లైన్‌ను రాజమౌళి చెబుతారు అని కూడా అంటున్నారు. ‘మహరాజ్‌’ (Maharaja) ఎలా మిక్సింగ్‌ అవుతుంది అని డౌట్‌ ఉంటే.. ఆ పేరును ‘MAH – RAJ’ అని ఇంగ్లిష్‌లో రాసి చూడండి అర్థమవుతుంది. అంటే మహేష్‌లోని MAH.. రాజమౌళిలోని RAJని తీసుకుంటున్నారట.

ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేస్తారు. కానీ ఆ పేరు ఇప్పటికే వాడేసి ఉన్నారు. ఇటీవల విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ఆ పేరుతోనే సినిమా తెచ్చారు. ఈ నేపథ్యంలో సినిమాను ‘MAH – RAJ’ అని విడిగా పలికే ఏర్పాటు చేస్తున్నారట. అయితే సినిమాకు ‘గరుడ’ అనే పేరు ఫిక్స్‌ చేశారని ఇప్పటికే బలంగా సమాచారం వచ్చింది. గరుడ పక్షి రెక్కలతో ఆ మధ్య సినిమా టీమ్‌లో ఒకరు టీజ్‌ కూడా చేశారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus