సోషల్ మీడియా వచ్చాక ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరిట ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఇలాంటి సంఘటనపై సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) పోరాడిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఒక తండ్రి, కూతురు బందం గురించి ఒక వ్యక్తి చాలా చెత్తగా మాట్లాడాడు. ఇలాంటి కామెంట్స్ చూసి ఆ తండ్రి డిప్రెషన్ కి వెళ్లిపోయాడు. ఈ విషయంపై తేజు స్పందించి పోలీసులను యాక్షన్ తీసుకోవాలని కోరడం అలాగే తల్లిదండ్రులు ఇలాంటి మృగాలకి దూరంగా తమ పిల్లలను ఉంచాలి అని కోరడం జరిగింది.
దీంతో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీంతో సోషల్ మీడియాలో పిచ్చి వాగుడు వాగే చాలా మంది భయపడుతున్నారు. ఇప్పుడు రేణు దేశాయ్ (Renu Desai)వంతు వచ్చింది. ఇటీవల మరో సోషల్ మీడియాలో సెలబ్రిటీ రణవీర్ అలహాబాదియా ‘ఇండియా గాట్ లేటెంట్’ అనే షోలో ఒక లేడి కంటెస్టెంట్ ను .. “మీ పేరెంట్స్ Sruగారం చేసుకోవడాన్ని నువ్వు జీవితాంతం చూడగలవా ? లేక ఒకసారి నువ్వే Seక్స్ లో పాల్గొని దాన్ని శాశ్వతంగా ఆపగలవా? అంటూ ఘోరమైన మాటలు మాట్లాడాడు.
దీంతో రణవీర్ పై విమర్శలు వర్షం కురిపించారు నెటిజన్లు. దీనిపై రేణు దేశాయ్ (Renu Desai) స్పందిస్తూ.. “మీ పిల్లల్ని ఇలాంటి వాటి నుండీ దూరంగా ఉండేలా చూసుకోవాలి, ఇలాంటి ఇడియట్స్‌కి చాలా దూరంగా ఉంచడం ఉత్తమమైన పని. దయచేసి వీళ్లని అన్ ఫాలో చేయాలి. యంగ్ జనరేషన్ ను వీళ్ల వల్గర్ బిహేవియర్ తో పాడు చేస్తారు. వీళ్లకి వావి వరస లేదు ” అంటూ మండిపడింది.