మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కేసు విషయంలో కేరళ కోర్టు ఓ కీలక తీర్పు ఇచ్చింది. 2015లో డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన చాకో సహా మరో ఆరుగురికి కోర్టు పూర్తిస్థాయిలో క్లీన్‌చీట్ ఇచ్చింది. ఎర్నాకుళం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ఈ కేసును పరిశీలించి, చాకోతో పాటు నలుగురు మహిళలు, ఓ నైజీరియన్, తమిళనాడుకు చెందిన వ్యక్తిని నిర్దోషులుగా ప్రకటించింది.
ఈ కేసు 2015లో కేరళలో సంచలనం రేపింది. పోలీసులు ఓ ఫ్లాట్‌పై దాడి చేసి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో షైన్ టామ్ చాకో సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన చాకో, సినిమాల్లో నటిస్తూ తన కెరీర్‌ను కొనసాగించారు. కానీ కేసు విచారణ మాత్రం సాగుతూనే వచ్చింది. తాజా తీర్పుతో షైన్ టామ్ చాకో నిర్దోషిగా నిలవడంతో, ఆయన మిగతా వ్యక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజా కోర్టు తీర్పుతో చాకో కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడే అవకాశమే లేదు. ఇప్పటికే ఆయన మలయాళ, తమిళ, తెలుగు చిత్రాల్లో వరుస అవకాశాలను దక్కించుకుంటున్నారు. తెలుగులో నాని హీరోగా నటించిన ‘దసరా’లో చిన్ననంబి పాత్ర చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా విజయంతో సౌత్ లో అతనికి క్రేజీ ప్రాజెక్టులు రావడం మొదలయ్యాయి. ఇటీవల ఎన్టీఆర్ నటించిన ‘దేవర’లో కూడా షైన్ టామ్ చాకో ఓ కీలక పాత్ర పోషించాడు. ఇక 2024లో వచ్చిన ‘డాకు మహరాజ్’ లో ఇన్‌స్పెక్టర్ స్టీఫెన్‌గా అలరించాడు.
ఈ సినిమా విడుదలకు ముందే తనపై నడుస్తున్న డ్రగ్ కేసు కారణంగా కొందరు విమర్శలు చేసినా, ఆయన నటనకు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీలో పలు క్రేజీ ప్రాజెక్టులు షైన్ టామ్ చాకోను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం మోహన్‌లాల్ నటిస్తున్న ‘లూసిఫర్ 2’ లో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అలాగే ‘చత్తులి’, ‘బజూకా’, ‘ఆరామ్ తిరుకల్పన్’, ‘వెల్లప్పమ్’, ‘పారడైజ్ సర్కస్’ వంటి చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. తాజా కోర్టు తీర్పుతో షైన్ టామ్ చాకోను మరోసారి క్లీన్‌గా నిలబెట్టడంతో, ఆయనపై నెగెటివ్ ప్రచారం జరుగుతున్న మాటలకు బ్రేక్ పడింది. ఇకపై తన కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టేందుకు చాకో సిద్ధమయ్యాడు.