Nagarjuna: నాగార్జున 99వ సినిమా మీద నిర్మాత అలా అన్నారేంటి.. ఏం జరుగుతోంది?

  • May 11, 2023 / 07:34 PM IST

నాగార్జున వందో సినిమా ఏంటి అనే విషయం ఇప్పటికే తేలిపోయింది. జయం మోహన్‌రాజా దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది అని చాలా రోజుల క్రితమే చెప్పేశారు. అయితే ఇప్పుడు సమస్యల్లా 99వ సినిమా. నెర్వస్‌ 90 కాన్సెప్ట్‌లో నాగార్జున విషయంలో నెర్వస్‌ 99 జరుగుతోంది. ఎందుకంటే చాలా రోజుల క్రితమే అనధికారికంగా ఓకే అయిన ఈ సినిమా ఇంకా పట్టాలెక్కడం లేదు. ఇప్పుడు నిర్మాత మాటలు వింటుంటే సినిమా విషయంలో ఏదో తేడా కొట్టేసింది అనిపిస్తోంది.

నాగచైతన్య ‘కస్టడీ’ సినిమా ప్రచారంలో భాగంగా నిర్మాత శ్రీనివాస్‌ చిట్టూరి ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఆ సినిమా గురించి చెబుతూ చెబుతూ నాగార్జున 99వ సినిమా గురించి చర్చ వచ్చింది. నిజానికి ఈ సినిమాను రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతూ చేయాల్సి ఉంది. ఈ మేరకు ఇటీవల సినిమా టీమ్‌ మాట్లాడారు కూడా. ప్రస్తుతం ప్రసన్న అదే పనిలో ఉన్నారు కూడా. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా విషయంలో తేడా కొట్టింది అని వార్తలొస్తున్నాయి.

ఇప్పుడు నిర్మాత మాటలు వింటుంటే తేడా కొట్టింది నిజమే అంటున్నారు. జూన్‌ మూడో వారంలో సినిమా మొదలుపెడతాం అని చెప్పిన నిర్మాత.. దర్శకుడు ఇతర వివరాలు త్వరలో చెబుతాం అని చెప్పారు. ప్రసన్న కుమార్‌ సినిమా అయి ఉంటే ఆయన పేరు చెప్పేవారు కదా అనే చర్చ మొదలైంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌లోకి కొత్త దర్శకుడు వచ్చారా అనే చర్చ కూడా జరుగుతోంది. మరి ఈ విషయంలో క్లారిటీ ఎప్పుడు ఇస్తారో చూడాలి.

నిజానికి నాగ్ (Nagarjuna) మీద లుక్ టెస్ట్ నెలల క్రితమే పూర్తి చేశారు. అక్కడ కూడా సంతృప్తిగా లేరు అని చెబుతారు. మలయాళంలో మంచి విజయం అందుకున్న ‘పోరంజు మరియం జోస్’ అనే సినిమాకు నాగ్‌ 99 రీమేక్‌. ఒరిజినల్ వెర్షన్ నుండి కేవలం కొంత భాగం తీసుకున్నామని మార్పులతో ఈ సినిమా చేస్తాం అని అంటున్నారు. ఈ సినిమాలో నాగార్జునకు స్నేహితుడిగా అల్లరి నరేష్ నటించబోతున్నారని సమాచారం.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus