Salaar 2: సల్లబడ్డ ‘సలార్‌’.. రెండో పార్టు ఎప్పుడు? ఎక్కడా సప్పుడు లేదేం?

  • July 26, 2024 / 08:50 PM IST

ఏ హీరోకైనా మంచి సినిమా పడ్డాక, అది రూ. వందల కోట్లు వసూళ్లు అందుకున్నాక దాని సీక్వెల్‌ వస్తుంది అంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఆయన అభిమానులకు కూడా అంతే ఆనందం కలుగుతుంది. కానీ ప్రభాస్‌ (Prabhas) విషయంలో ఆ ఆనందం కనిపించడం లేదు. ఆయన సంగతేమో కానీ… ఆయన అభిమానుల విషయంలో అయితే కచ్చితంగా కనిపించడం లేదు. సోషల్‌ మీడియాలో దీని గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏమైందంటే?

గతేడాది ప్రభాస్‌ నుండి వచ్చిన ‘సలార్’ (Salaar) సినిమా ఎంతటి భారీ విజయం అందుకుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఫలితం చూశాక ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేశారు. చాలా రోజులుగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న ఆయన ఫ్యాన్స్‌ ఆనందం అలాంటిది మరి. అయితే ఆ సినిమాకు సీక్వెల్ కూడా ఉండటంతో ఆ సినిమా కూడా వచ్చేసి మరో భారీ విజయం అందుకోవడం పక్కా అని అనుకున్నారు. కానీ ఆ సినిమా ఇంకా మొదలుకాలేదు. ఇదే అసలు సమస్య.

అదేముంది.. ప్రభాస్‌ బిజీగా ఉన్నాడేమో అందుకే మొదలుకాలేదు అని సరిపెట్టుకుని ఊరుకోవచ్చు. అయితే ఆయన లేకపోయినా సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేసేస్తారు అని వార్తలు రావడమే కారణం. ‘సలార్‌ 2’ షూటింగ్‌ను మే నెలలో స్టార్ట్‌ చేస్తారని అప్పట్లో వార్తలొచ్చాయి. టీమ్‌ నుండి కూడా దాదాపుగా ఇదే సమాధానం వచ్చింది. అయితే ఇప్పుడు ఆగస్టు వచ్చేస్తున్నా ఇంకా సినిమా మొదలుకాలేదు. ఆ దాఖలాలు కూడా కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో ‘సలార్‌ 2’ సినిమా షూటింగ్‌ ఎప్పుడు? అనే ప్రశ్న వినిపిస్తోంది. మరోవైపు ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా సీక్వెల్‌ కూడా ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. సినిమా టీమ్‌ చెబుతున్న దాని ప్రకారమే ఈ డౌట్‌. దీంతో ప్రభాస్‌ సినిమాలకు ఈ సీక్వెల్స్‌ సమస్య ఏంటి అనే చర్చ మొదలైంది. మరి దీనికి ప్రభాస్‌ టీమ్‌ ఏమన్నా స్పందిస్తుందేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus