Janhvi Kapoor: టాలీవుడ్ హీరోకే ఓటు వేసిన జాన్వీ కపూర్.. ఎదురుచూస్తున్నానంటూ?

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించినా మరీ భారీ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకోని జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  తెలుగులో మాత్రం వరుస సినిమా ఆఫర్లను సొంతం చేసుకోవడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు. తెలుగులో తొలి సినిమా రిలీజ్ కాకుండానే ఏకంగా మరో 2 సినిమాలలో నటించే అవకాశం రావడం జాన్వీ కపూర్ కే సాధ్యమని చెప్పవచ్చు. అయితే తాజాగా ఒక సందర్భంలో ఎన్టీఆర్ (Jr NTR)  గురించి ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

మహేష్ (Mahesh Babu)  రాజమౌళి (SS Rajamouli) కాంబో సినిమా కోసం సైతం ఈ బ్యూటీ పేరును పరిశీలిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. తాజాగా ఒక సందర్భంలో జాన్వీ కపూర్ కు హృతిక్ రోషన్  (Hrithik Roshan) , విక్కీ కౌశల్ (Vicky Kaushal) లలో ఎవరితో డాన్స్ చేయడానికి ఇష్టపడతారనే ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు జాన్వీ కపూర్ చెప్పిన ఇద్దరు హీరోల పేర్లు కాకుండా ఎన్టీఆర్ పేరు చెప్పడం కొసమెరుపు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డాన్స్ చేయడానికి నేను ఇష్టపడతానని జాన్వీ కపూర్ వెల్లడించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక మాస్ డాన్స్ చేశానని ఆమె పేర్కొన్నారు. దేవర (Devara)  సినిమాలో మరో సాంగ్ కూడా ఉందని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. మరో సాంగ్ లో తారక్ తో కలిసి డాన్స్ చేయడం కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఈ బ్యూటీ చెప్పుకొచ్చారు.

జాన్వీ కపూర్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జాన్వీ పారితోషికం 4 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండగా సెకండ్ సింగిల్ కు సంబంధించిన క్రేజీ అప్ డేట్ త్వరలో వచ్చే అవకాశం ఉంది. జాన్వీ కపూర్ కెరీర్ పరంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటే మరో ఐదేళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగుండదు. శ్రీదేవి కూతురు కావడం ఆమెకు ప్లస్ అయింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus