సినిమాల్లో బోల్డ్ సన్నివేశాలు ఉండటం, వాటిని ఓకే చేయించుకుని థియేటర్లకు వరకు తీసుకురావడం ఎంత కష్టమో, ఆ సన్నివేశాలు చిత్రీకరించడం, వాటిలో నటించడమూ అంతే కష్టం. ఈ విషయాన్ని చాలా మంది సాంకేతిక నిపుణులు, నటీనటులు గతంలో చెప్పారు కూడా. తాజాగా కథానాయిక అంజలి (Anjali) కూడా ఇదే మాట చెప్పింది. తన కొత్త వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’ గురించి మీడియా ముందుకు వచ్చిన అంజలి దగ్గర అందులోని ఈ సన్నివేశాల గురించి ప్రస్తావిస్తే ఈ విషయాలు బయటకు వచ్చాయి.
అంజలి ప్రధాన పాత్రలో నటించిన ‘బహిష్కరణ’ వెబ్‌సిరీస్‌లో శృంగార సన్నివేశాలు కొన్ని ఉన్నాయనే సంగతి తెలిసిందే. రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్‌లో అంజలి వేశ్యగా నటించింది. అంజలితోపాటు శ్రీతేజ, రవీంద్ర విజయ్ (Ravindra Vijay), అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను ముకేశ్ ప్రజాపతి రూపొందించారు. జీ 5లో విడుదలైన ఈ సిరీస్ గురించి ఇటీవల మీడియాతో మాట్లాడింది టీమ్. ఈ క్రమంలోనే అంజలి దగ్గర ఆ సన్నివేశాల గురించి ప్రస్తావన వచ్చింది.
వెబ్ సిరీస్‌లో ఇంటిమేట్ సీన్స్ చేసేటప్పుడు ఇబ్బంది పడ్డారా? రవీంద్ర విజయ్‌తో ఇబ్బందిగా అనిపించిందా లేక శ్రీతేజ్‌తో ఆ సీన్స్ చేసినప్పుడు ఇబ్బందిపడ్డారా అని ప్రశ్నించగా అంజలి తన సమస్యలు చెప్పుకొచ్చారు. దాంతోపాటు తనదైన శైలిలో ఘాటుగానే సమాధానం ఇచ్చారు కూడా. ‘మీరు చెప్పిన ఇబ్బంది పుష్ప (‘బహిష్కరణలో అంజలి పాత్ర))కు ఉండదు. కానీ, అంజలికి ఉంటుంది అని చెప్పారామె.
వెబ్‌సిరీస్‌లో శ్రీతేజతో కలసి నటించినా,. రవీంద్ర విజయ్‌తో కలసి నటించినా ఆ సన్నివేశాలు అంటే చాలా ఇబ్బందే. ఏ సీన్ అయినా చిత్రీకరించేటప్పుడు సెట్‌లో 20 మందికిపైనే జనాలు ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సీన్లు చాలా ఇబ్బందిపెడతాయి. అంతెందుకు పురుష యాక్టర్లకు కూడా అలాంటి సన్నివేశాల్లో నటించడం తేలిక కాదు అని అంది అంజలి . అంజలి చెప్పినట్లు ఆ సన్నివేశాల్లో నటించడం తేలికాదు. ఆ సన్నివేశం మిగిలిన సన్నివేశాల్లా ఎంజాయ్ చేస్తూ నటించేది కాదు. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో ముందుగానే మాట్లాడుకుని, తర్వాత నటిస్తాం అని చెప్పారు.