మొన్నీమధ్య వరకు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కొత్త సినిమా ఎప్పుడు? అనే ప్రశ్నే వినిపించింది. ఇప్పుడు ఫలానా సినిమానే కావాలి అనే ప్రశ్న వస్తోంది. దానికి కారణం పవన్ కల్యాన్ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలకు డడేట్స్ ఇస్తుండటమే. మొన్నీమధ్యే ‘ఓజీ’ (OG Movie) సినిమా షూటింగ్ మొదలైంది అని వార్తలు రాగా, ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా షూటింగ్ మొదలవుతుంది అని టీమ్ అనౌన్స్ చేసింది. అక్కడితో ఆగకుండా సినిమా గురించి ఇప్పటికే చెప్పిన రిలీజ్ డేట్‌ను మరోసారి టీమ్ రీ అనౌన్స్ చేసింది.
దీంలో ఫ్యాన్స్ మరోసారి అలర్ట్ అయిపోయారు. ఎందుకంటే ఆ సినిమా కంటే వేరే సినిమా రావడం వారికి కావాలి కాబట్టి. ‘ఓజీ’ సినిమా కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా ప్రచార చిత్రాలు, ఇతర నటులు,, సాంకేతిక నిపుణులు ఇస్తున్న హైపే దానికి కారణం. ‘హరి హర వీరమల్లు’ అంటే హైప లేదా అంటే కచ్చితంగా ఉంది అనే చెప్పాలి. కానీ దాని కంటే ‘ఓజీ’కే ఎక్కువ హైప్ ఉంది.
దీంతో ఎలాగోలా ‘ఓజీ’ సినిమానే ముందు రిలీజ్ చేయండి అని ఫ్యాన్స్ కోరుతున్నారు. నిజానికి ‘హరి హర..’ ముందుగా చెప్పినా మార్చి 28, 2025న వస్తుందని ఎవరూ ఊహించలేదు. అలానే అంటారులే ఆ టైమ్‌కి రాదు అని అనుకున్నారు. అయితే ఇప్పుడు ‘హరి హర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ సినిమా ఆఖరి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం అని చెబుతున్నారు.
ఈ వారాంలో వందలాదిమంది ఫైటర్లు, కీలక నటులపై పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తారట. దాంతో సినిమా చిత్రీకరణ అయిపోయినట్లే అని చెబుతున్నారు. అదే జరిగితే ‘ఓజీ’ కంటే ముందు ఈ సినిమానే వస్తుంది. అయితే ఏదో ఒక సినిమా రానీయండి.. అప్పుడే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) పనులు ప్రారంభమవుతాయి అని ఆశావహ దృక్పథం ఉన్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు.