Pushpa 2: ‘పుష్ప 2’ వాళ్లకి స్పెషల్ షో వేసిన టీం.. టాక్ ఎలా ఉందంటే?

‘బాహుబలి-2’ (Baahubali 2) ‘కేజీఎఫ్-2’ (KGF 2) వంటి సినిమాల తర్వాత ఆ రేంజ్లో ఇండియా వైడ్ హైప్ క్రియేట్ చేసిన సినిమాగా ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) గురించి చెప్పుకోవాలి. వాస్తవానికి ఆగస్టు 15 కే సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ సకాలంలో షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడంతో మంచి డేట్ కోసం వెయిట్ చూసిన టీం చివరికి డిసెంబర్ 5 కి ఫిక్స్ అయ్యింది. నిన్నటితో అంటే నవంబర్ 26 తో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.

Pushpa 2

పారలల్ గా మిక్సింగ్, ఎడిటింగ్ పనులు కూడా చేయడం వల్ల ఫస్ట్ కాపీ ఫాస్ట్ గా రెడీ అయ్యింది. దర్శకుడు సుకుమార్ పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉండి ప్రమోషన్స్ కి హాజరు కాలేకపోయారు. మొత్తానికి ఈ రోజు ఫస్ట్ కాపీ అందుబాటులోకి రావడం.. సాయంత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే దీనికి ముందు.. అన్నపూర్ణ స్టూడియోస్ లో కొంతమంది టాలీవుడ్ పెద్దల కోసం ఓ షో వేయడం జరిగింది.

అందులో అల్లు అర్జున్ (Allu Arjun) తండ్రి అల్లు అరవింద్ (Allu Aravind) కూడా ఉన్నారట. ఉదయం 11 ఆ టైంలో షో వేయగా.. కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం 2 అయ్యిందని సమాచారం. సినిమా చూశాక అంతా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారట. ‘మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా ఫుల్ ఫీస్ట్’ అని సినిమా చూసిన వాళ్ళు చెప్పారట.

అల్లు అర్జున్, సుకుమార్(Sukumar) ..ల కెరీర్లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్ గా మిగిలిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలిపారట. సినిమాలో ప్రతి 15 నిమిషాలకు ఓ హై మూమెంట్ ఉందని.. అల్లు అరవింద్ తెలిపారట. మొత్తంగా ఆయన ఫుల్ హ్యాపీ అని సమాచారం. సో ‘పుష్ప 2’ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందన్న మాట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus