Balakrishna: తమిళనాట ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్‌ ఎందుకంటే?

  • July 23, 2021 / 01:07 PM IST

మన దేశంలోని సినిమా అభిమానులకే కాదు… ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులకు తెలిసిన పేర్లలో ఏ.ఆర్‌.రెహమాన్‌ ఒకటి. సంగీత దర్శకులు ఆస్కార్‌ వేదికెక్కిన భారతీయుడు అతను. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘ఎ.ఆర్‌.రెహమానా… ఎవరో నాకు తెలియదు’ అని అన్నారు నందమూరి బాలకృష్ణ. దీంతో ఇప్పుడు ఆయన పేరు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. అది కూడా #WhoisBalakrishna అంటూ ట్రెండ్‌ అవుతోంది. ఇంతకీ ఏమైందంటే. ‘ఆదిత్య 369’ 30 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో

ఇటీవల నందమూరి బాలకృష్ణ ఓ మీడియా సంస్థకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన సినిమా విషయాలు చెబుతూనే… మిగిలిన అంశాల గురించి ప్రస్తావించారు. అందులో ఒకటి ఎ.ఆర్‌.రెహ్మాన్‌ గురించి. ‘రెహమానా… ఆ పేరుతో ఎవరూ తెలియదే’ అని అన్నారట బాలకృష్ణ. దీంతో రెహమాన్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య అన్నమాటకు ప్రతిగా #WhoisBalakrishna పేరుతో ఓ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి తీసుకొస్తున్నారు. బాలకృష్ణ అంటే ఎవరో తమకు తెలియదు అంటూ ఆ ట్వీట్లలో అంటున్నారు.

గతంలో నాగబాబు ఇలా అంటే… టాలీవుడ్‌ అభిమానుల్లో పెద్ద దుమారం రేగింది. ఇప్పుడు అదే ఇటు బాలయ్య, అటు రెహమాన్‌ ఫ్యాన్స్‌ అదే తరహా ప్రశ్న వేస్తున్నారు. ఇప్పుడు ఎవరన్నా స్పందిస్తారేమో చూడాలి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus