సినిమా పరిశ్రమలో మీటూ.. ఇది ఇప్పటి చర్చ కాదు. ఎన్నో ఏళ్లుగా మన కథానాయికలు, నటీమణులు చెబుతూనే ఉన్నారు. కొంతమంది ఈ విషయాన్ని ఉద్యమరూపంలో ముందుకు తీసుకెళ్లారు కూడా. అయితే కొంతమంది మాత్రం దీని గురించి ఎక్కడా పెద్దగా ప్రస్తావించకుండా కొన్నేళ్ల తర్వాత చెబుతున్నారు. అలా హన్సిక కూడా ఇటీవల తను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితుల గురించి వివరించింది. గతంలో ఓ హీరో తనను డేట్‌కి రమ్మని ఫోర్స్ చేశాడని చెప్పుకొచ్చింది.
తెలుగు సినిమా పరిశ్రమలో ఓ హీరో నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేవాడు. డేట్‌కి వస్తావా అని అడిగేవాడు. వరుసగా ఇదే ప్రస్తావన ఉండేసరికి అతనికి తగిన రీతిలో బుద్ధి చెప్పాను అని హన్సిక ఇటీవల చెప్పుకొచ్చింది. దీంతో హన్సికకు కూడా ఈ పరిస్థితి తప్పలేదా అంటూ కొందరు అంటుంటే.. అసలు ఎవరు ఆ హీరో అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అంతలా ఇబ్బంది పెట్టే హీరో మన దగ్గర ఎవరు అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది.
బాల నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది హన్సిక. ఆ తర్వాత హఠాత్తుగా హీరోయిన్ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె ఎదుగుదల మీద చాలా పుకార్లు వచ్చాయి. అయితే వాటికి హన్సిక క్లారిటీ ఇచ్చింది. ఇటీవల తన పెళ్లి సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ మేరకు క్లారిటీలు వచ్చాయి. అయితే తాజాగా మరొక ఇంటర్వ్యూల్లో ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న అంశాలను గురించి, కష్టాల గురించి చెప్పింది. అందులో భాగంగానే ‘డేట్’ సమస్య గురించి వివరించింది.
హన్సిక(Hansika) తెలుగులో చేసిన సినిమాలు చూస్తే.. హీరోలు చాలావరకు పేరున్నవాళ్లే. ఆమె అధికారికంగా చెప్పలేదు కానీ.. ఈ డేట్ గొడవ ఆమె ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లోనే జరిగి ఉండొచ్చు అంటున్నారు. ఆ హీరోతో మళ్లీ సినిమాలు చేయలేదు ఆమె. కాబట్టి ఆ హీరో ఎవరు అనేది చెప్పడం ఈజీనే కానీ.. క్లారిటీ లేకుండా పేరు చెప్పలేం. దీంతో ఆ హీరో గురించి హన్సికను పర్‌ఫెక్ట్ క్లూ ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు. చూద్దాం తర్వాత ఎప్పుడైనా చెబుతుందేమో.
బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!
అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు