బిగ్ బాస్ 4: విన్నర్ ఎవరో అవినాష్ కి తెలిసిందా..?

  • November 30, 2020 / 01:36 PM IST

బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం ఎలిమినేషన్ అనేది నాటకీయంగా జరిగింది. నిజానికి అవినాష్ తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అయిపోయాడు. కానీ, తను సంపాదించుకున్న అవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల బతికిపోయాడు. చివరకి వరకూ అరియానా, అవినాష్ ని కావాలనే ఉంచింది బిగ్ బాస్ టీమ్. ఇక్కడే అవినాష్ కి టెస్ట్ పెట్టింది. తనకోసం ఫ్రీ పాస్ వాడతాడా.. లేదా అరియానాకోసం వాడతాడా అనేది డిసైడ్ చేస్కోమని చెప్పారు. ఇక్కడే అవినాష్ చాలాసేపు ఆలోచించాడు. మిగతా హౌస్ మేట్స్ ని కూడా సంప్రదించి సలహా తీసుకున్నాడు.

ఫైనల్ గా అవినాష్ ఫ్రీ పాస్ ని తనకోసమే తను వాడతాను అన్నాడు. ఎందుకంటే, అరియానా సేఫ్ అవుతుంది అని ముందుగానే గ్రహించాడు. అందుకే రిస్క్ తీస్కోవడం ఎందుకు అని తనకోసం ఈవారం పాస్ వాడాడు. దీనివల్లే ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. ఒకవేళ ఓవర్ కాన్ఫిడెంట్ తో ఎలిమినేషన్ పాస్ వాడకపోయినా, అరియానాకోసం వాడినా ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయి ఉండేవాడు.

ఇదే విషయాన్ని స్టేజ్ పైన ఉన్న నాగార్జునతో షేర్ చేసుకున్నాడు. నిజానికి ప్రేక్షకుల దృష్టిలో నేను ఎలిమినేట్ అయిపోియనట్లే కదా సార్.. మరి గేమ్ లో ఎలా ముందుకు వెళ్లాలి అని ప్రశ్నించాడు. అంతేకాదు గత కొన్ని వారాలుగా సేఫ్ అవుతున్న పార్టిసిపెంట్స్ ని చూసినట్లయితే, విన్నర్ ఎవరు అవుతారు.

టాప్ 5లోకి, అలాగే టాప్ 2లోకి ఎవరు వస్తారు అనేది హౌస్ లో అవినాష్ కి అర్ధమయిపోయింది. అందుకే , టాప్ – 5 కి వెళ్లినా అరియానాకంటే నేను వీక్ కంటెస్టెంట్ అలాగే, అఖిల్, మోనాల్ కంటే కూడా నేను వీక్ కంటెంస్టెట్ అని అర్ధమైంది. అందుకే, ఈ రెండు వారాలు ఉన్నా కూడా విన్నర్ కాలేము అనే సందేహంతోనే ఇప్పుడు గేమ్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. అవినాష్ బాధ కూడా ఇదే. అదీ మేటర్.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus