దక్షిణాది చిత్ర పరిశ్రమను దూషిస్తూ నేను వ్యాఖ్యలు చేశానంటూ కొన్ని అసత్య ప్రచారాలు వైరల్‌గా మారాయి. ఆ ప్రచారాలను నమ్మొద్దు, ఇకనైనా ఆపండి… అంటూ ప్రముఖ కథానాయిక ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది చూసే ఉంటారు. ఆమె ఏమందని వార్తలొచ్చాయి, ఆ తర్వాత ఏమైంది అనేది కాసేపు పక్కనపెడదాం. ఆమె మీద అంతగా పుకార్లు వస్తుంటే.. స్పందించడానికి ఇంత టైమ్ ఎందుకు పట్టింది అనేది కాసేపు చూద్దాం. తన ఫేమ్‌ను బద్నామ్ చేస్తూ ఇంత వార్తలు వైరల్ అవుతుంటే రాశీ ఖన్నాకి కానీ, ఆమె పీఆర్ టీమ్‌కి ఈ విషయం తెలియలేదా?
రాశీ ఖన్నా ఇటీవల ‘రుద్ర’ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటించింది. దాని ప్రచారం కోసం బాలీవుడ్లో వరుస ఇంటర్వ్యూల్లో ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె సౌత్ ఇండస్ట్రీ గురించి వ్యాఖ్యలు చేసిందంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు కనిపించాయి. దీంతో ఎందుకిలా అంటోంది అంటూ తెలుగు మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఇలియానా, తాప్సితో ఆమెను పోలుస్తూ వాళ్లూ గతంలో ఇలానే అని ఇండస్ట్రీకి దూరమయ్యారు, ఇప్పుడు రాశీ ఖన్నా వంతు అని రాసుకొచ్చారు.
ఇదంతా మొదలై ఓ రెండు, మూడు వారాలు అవుతోంది. ఇప్పుడిప్పుడే ఆ వార్తల జోరు కూడా తగ్గింది. సరిగ్గా ఇప్పుడు రాశీ ఖన్నా వచ్చి ‘నేనా మాటలు అనలేదు’ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆమె అంటే ఇక్కడ లేదు కాబట్టి… ఇక్కడ ఏం పుకార్లు వస్తున్నాయి అనేది తెలియదు. కానీ ఆమె టీమ్ ఇక్కడే ఉంటారు కదా. వాళ్లు కూడా చెప్పలేదా అనే ప్రశ్న మొదలైంది. తమ హీరోయిన్ గురించి అంతగా రాస్తుంటే ఏం చేస్తున్నారు అనే ప్రశ్న రాశీ ఖన్నా అభిమానులు, నెటిజన్లలో వినిపిస్తోంది.
ఇక రాశీ సౌత్ గురించి ఇలా అంది అంటూ పుకార్లు వచ్చాయి. సౌత్‌లో హీరోయిన్ను గ్లామర్ డాల్‌గా మాత్రమే చూస్తారని, కాస్త తెలుపుగా ఉంటే మిల్కీ బ్యూటీ అనేస్తారు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తనను అందరూ గ్యాస్ ట్యాంకర్ అనేవారని కూడా అందట. అప్పట్లో ఆమె లావుగా ఉండేదనే విషయం తెలిసిందే. అయితే రాశీ ఖన్నా మాత్రం ఇలాంటి మాటలేవీ నేను ఎక్కడా అనలేదు అంటోంది. ఏది నిజమో బాలీవుడ్ మీడియానే చెప్పాలి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!